Natyam ad

ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలు 

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆదిశంకరాచార్యుల వారి  జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. సంఘ ప్రతినిధులు రామమూర్తి, రామకృష్ణ, ఫణిభాస్కర్‌, మురళి, శశికుమార్‌ ల ఆధ్వర్యంలో శంకరాచార్యుల కాంస్య విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలతో అలంకరించారు. ఈ సందర్భంగా శంకరాచార్యుల ఆశయాలను కాపాడాలని పిలుపునిచ్చారు. తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు జిఆర్‌.నారాయణ, టివిఎస్‌.ప్రసాద్‌, గిరి, అశ్వర్థ, వేణు, మహేష్‌ , వివేక్‌, కుమార్‌, వినోద్‌, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags;Adi Shankaracharya’s birth anniversary celebrations

Post Midle