రాజన్నను దర్శించుకున్న ఆది శ్రీనివాస్

వేములవాడముచ్చట్లు:

వేములవాడ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో  కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్న మాటను రెండు నెలల క్రితమే చెప్పానని, ఆ మాటే నిజమైందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారిగా వేములవాడకు వచ్చిన ఆది శ్రీనివాసును ఆలయ అర్చకులు ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను వంద రోజుల్లో అమలు చేస్తానన్న హామీని నిలబెట్టుకుంటుందని, రేపటినుండి మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం ప్రారంభమవుతుందని అలాగే 10 లక్షల ఇన్సూరెన్స్ వర్తింపజేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని గ్యాలరీలను అమలు పరుస్తామన్నారు. వేములవాడ రాజన్న ఆలయ చైర్మన్ చేస్తే ఎమ్మెల్యేగా గెలవడన్న దుష్ప్రచారాన్ని పటాపంచలు చేసి రాజన్న ఆశీస్సులతో ఎమ్మెల్యేగా తనను, ఇటీవల పాదయాత్ర చేసిన సందర్భంలో రాజన్నను దర్శించుకున్న రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేశారని, తనపై పది సంవత్సరాలుగా ఎన్నికల సమయంలో ప్రతిసారి ప్రచారం చేశారని, అయినా కూడా ఆ రాజన్న ఆశీస్సులతో తాను గెలుపొందినట్లు చెప్పారు. రాజన్న ఆలయ అభివృద్ధికి డేటా 100 కోట్లు ఇస్తానని మాజీ సీఎం కేసీఆర్ స్వామికే శఠగోపం పెట్టిన కెసిఆర్ కు రాజన్న నే తగిన బుద్ధి చెప్పారు.

Tags: Adi Srinivas visited Rajanna

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *