ఆదిలాబాద్‌ సరిహద్దులో విద్యార్థుల అడ్డగింత

Date:30/03/2020

ఆదిలాబాద్‌  ముచ్చట్లు:

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో మహారాష్ట్రలో చిక్కుకుపోయిన తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు స్వస్థలాలకు బయలుదేరారు. ఆదిలాబాద్‌ జిల్లాలోకి రాగానే ఆర్డీవో సూర్యనారాయణ ఆధ్వర్యంలో అధికారులు వారిని అడ్డుకున్నారు. ఉభయ గోదావరి, ఖమ్మం, కరీంనగర్‌, గుంటూరు, వరంగల్‌, నల్గొండ, విజయవాడ ప్రాంతాలకు చెందిన సుమారు 105 విద్యార్థులను అడ్డుకుని సమీపంలోని మైనారిటీ గురుకులంలో ఏర్పాటు చేసిన కరోనా ప్రత్యేక క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. అక్కడ విద్యార్థులందరికీ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించి వైరస్‌ లక్షణాలు జ్వరం, జలుబుతో బాధపడుతున్న ముగ్గురు విద్యార్థులను చికిత్స నిమిత్తం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

అప్పటి వరకు పది పరీక్షలు వద్దు హైకోర్టు

Tags: Adilabad border crossing of students

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *