ఆదిలాబాద్ ఎంపీ కీలక వాక్యాలు..!

ఆదిలాబాద్ జిల్లా: తెలంగాణలోనూ ఇక బీజేపీ ప్రభుత్వమేనని, ఉత్తరాది రాష్ట్రాల ఫలితాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెంపపెట్టులాంటివని ఈ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు అన్నారు. ఈ మేరకు ఎంపీ సోయం మీడియాకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఘన విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి పదవి కైవసం చేసుకున్న నందుకు అభినందనలు తెలిపారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని కలలుకన్న కేసీఆర్కు నాలుగు రాష్ట్రాల ఫలితాలు దిమ్మదిరిగేలా చేశాయి అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రాష్ట్రంలో నిరుద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ఎంపీ అన్నారు. ప్రజలు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని టిఆర్ఎస్ పట్టణం ఖాయమని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.