రెవెన్యూ ఆఫీసర్ల నిర్వాకం

Date:16/09/2020

నిజామాబాద్ ముచ్చట్లు

రెవెన్యూ ఆఫీసర్ల నిర్వాకంతో కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామ రైతులు భారీగా నష్టపోనున్నారు. గ్రామ శివారులోని సర్వే నంబర్ 983లో 450 ఎకరాల అసైన్డ్ భూమిని రెవెన్యూ ఆఫీసర్లు 1959, 1970, 1995, 1996 సంవత్సరాల్లో విడతల వారీగా 170 మంది రైతులకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. రెవెన్యూ ఆఫీసర్లు చూపిన చోట ఆయా రైతులు పంటలు సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. భూ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ శాఖ ఆఫీసర్లు ఆ భూమిని సర్వే చేసి అటవీశాఖకు చెందినదని తేల్చారు. దీంతో ఫారెస్ట్ ఆఫీసర్లు తమ శాఖ భూమి అంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ భూమిలో పంటలు సాగు చేస్తున్న రైతుల పేర్లతో కూడిన గెజిట్ నోటిఫికేషన్ ను గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డుపై పెట్టారు. ఈ క్రమంలో రెవెన్యూ ఆఫీసర్లు రైతుల పట్టాలను హోల్డ్ లో పెట్టారు. దీంతో వానాకాలం సీజన్ లో ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతుబంధు పైసలు వారి ఖాతాలో జమకాలేదు. ఎకరానికి రూ.5వేల చొప్పున నష్టపోయారు.వెన్యూ ఆఫీసర్లు సర్వే నంబర్ 983లోని భూమిని రైతులకు పట్టాలు ఇవ్వగా, ధరలు పెరగడంతో పలువురు అమ్ముకున్నారు. ఈ క్రమంలో అప్పటి రెవెన్యూ ఆఫీసర్లు పట్టాల మార్పిడి కూడా చేశారు. ఇప్పుడు అవే భూములు ఫారెస్ట్ శాఖ పరిధిలోనివని తేల్చడంతో లక్షలు పెట్టి కొనుగోలు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.

 

 

 

లింగంపేట శివారులోని 983 సర్వే నంబర్ భూముల్లో తహసీల్దార్ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ఎస్సీ హాస్టల్, ఐకేపీ ఆఫీస్, విద్యుత్ సబ్ స్టేషన్, తదితర గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. తాజాగా ఈ భూములన్నీ అటవీశాఖ పరిధిలోకి వెళ్లడంతో ఏం జరుగుతుందోనని గవర్నమెంట్ ఆఫీసర్లు సైతం ఆందోళనగా ఉన్నారు.1954లో రెవెన్యూ శాఖ కాస్రా పహాణిని రూపొందించింది. ఇందులో రెవెన్యూ, ఫారెస్టు భూములకు సంబంధించిన వివరాలతోపాటు రెవెన్యూ శాఖకు చెందిన పట్టా భూములు, అసైన్ మెంట్, లావణి పట్టా, ఇనాం భూములకు సంబంధించిన వివరాలను కాస్రా పహాణీలో పొందుపరిచారు. సర్వేనంబర్ 983లోని భూములు 1954లో రూపొందించిన కాస్రా పహాణీలో ఫారెస్టు భూములని రికార్డుల్లో ఉన్నప్పటికీ రెవెన్యూ ఆఫీసర్లు అసైన్డ్ భూములుగా పట్టాలు పంపిణీ చేసినట్లు వెల్లడైంది.

ప‌ల్లెల్లో పాకుతున్న క‌రోనా

Tags: Administration of Revenue Officers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *