శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం

Admission of women in the Sabarimala temple

Admission of women in the Sabarimala temple

విస్తృత ధర్మాసనానికి కేసు బదిలీ

Date:14/11/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు ప్రకటించింది. 3:2 మెజారిటీతో సమీక్ష పిటిషన్లు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఏడుగురు న్యాయమూర్తులు గల విస్తృత ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. ఐదుగురు న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కేసు పునఃసమీక్షకు ధర్మాసనం అంగీకరించింది. అయితే కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయడాన్ని జస్టిన్ నారీమన్, జస్టిస్ చంద్రచూడ్ వ్యతిరేకించారు. శబరిమల కేసుపై సుప్రీంకోర్టు చీఫ్ స్టిస్ రంజన్ గొగోయ్ తీర్పును చదువుతూ.. ఒకే మతానికి చెందిన రెండువర్గాలకు సమాన హక్కులు ఉంటాయని, మతంపై చర్చకు పిటిషనర్లు తెరతీశారని, అన్ని ప్రార్థనా మందిరాల్లో మహిళల ప్రవేశానికి ఈ అంశం ముడిపడి ఉందన్నారు. శబరిమల అంశం మసీదులు, పార్శీల ఆలయాల్లోకి మహిళల ప్రవేశంలాంటిదేనని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. మత విశ్వాసం పౌరుల హక్కు అని, మతపరమైన అంశాలపై ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. పెండింగ్ పిటిషన్లపై విస్తృత ధర్మాసనం విచారిస్తుందని సీజే రంజన్ గోగోయ్ తెలిపారు. శబరిమల ఆలయంలో మహిళలు ప్రశేశించవచ్చని గత యేడాది సుప్రీం కోర్టు 4 : 1 మేజారిటితో తీర్పునిచ్చింది.  ఆలయంలో పది నుంచి యాభై ఏళ్ల మహిళల ప్రవేశాన్ని అనుమతించకపోవడం చట్టవిరుద్దం, రాజ్యంగవిరుద్దమని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

 

మోదీ సర్కార్ కు ఊరట

 

Tags:Admission of women in the Sabarimala temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *