పాఠశాలల్లో క్రీడా కోచ్ ఉద్యోగాలకోసం దరఖాస్తుల స్వీకరణ 

హైదరాబాద్ ముచ్చట్లు :
గిరిజన సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా జాతర్ల, భుపాలపల్లి జిల్లా ఎటూర్నాగారం లలో క్రీడా పాఠశాలలు  నిర్వహించ బడుచున్నది.  ఈ  క్రీడా పాఠశాలల్లొ వాలీబాల్, బాస్కెట్, బాల్ కోచ్ లు గా  గౌరవ వేతనంపై  అవుట్ సోర్సింగ్ బేస్ లో  పనిచేయుటకు ఆశక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తుల కోరబడుచున్నవి.
కోచ్ లుగా పనిచేయుటకు అభ్యర్థులు వాలీబాల్, బాస్కెట్ బాల్ నందు  నుండి ఒక  సంవత్సరం డిప్లొమా సర్టిఫికేట్ కలిగి వుండాలి. ఆశక్తి కల అభ్యర్థులు 01.10.2018 లోపు కమీషనర్, గిరిజన సంక్షేమ శాఖ, మాసాబ్ ట్యాంక్, హైదరాబాద్ నందుగల అకాడమిక్ సెల్ నందు గాని లేదా స్పోర్ట్స్ ఆఫిసర్ టీడబ్ల్యూడీ అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ కు గాని  పంపాలి.  దరఖాస్తు నమూన కొరకు, పూర్తి సమాచారం కొరకు అన్ని పనిదినాలలో 10:30  నుండి 5:00 గంటల మధ్యలో 9247267050 నెంబరు ను సంప్రదించ వలసి ఉంటుంది.
Tags:Admissions for sports coach jobs in schools

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *