నిబంధనలు పాటిస్తేనే అడ్మిషన్లు

Date:13/04/2018
మహబూబ్‌నగర్  ముచ్చట్లు:
2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలను సక్రమంగా పాటిస్తేనే అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు ఆన్‌లైన్‌లో లాగ్‌ఇన్ కానుంది. జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండలాల్లో ఉన్న పలు కళాశాలల్లో అనేక సమస్యలు ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందన్నారు. ప్రైవేటు జూనియర్ కళాశాలల నిర్వహణకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు నియమ నిబంధనలను పాటిస్తేనే అడ్మిషన్ల ప్రక్రియకు అనుమతి లభిస్తుంది. ఇంటర్మీడియట్ లాగ్ ఇన్ ఓపెన్ అయ్యేలోపు ఫైర్ సేఫ్టీతోపాటు కళాశాల నిర్వహణకు సంబంధించి ఎటువంటి పొరపాట్లు ఉన్న వెంటనే సరిచేసుకోవాలని సూచించారు. ఆయా కళాశాలలకు సంబంధించి తమ వద్దకు వచ్చేఫైళ్లను ఎప్పటికప్పుడు ఇంటర్మీడియట్ బోర్డుకు పంపి సమస్యలు లేకుండా సహకరిస్తామన్నారు. తాము తనిఖీలకు వచ్చినప్పుడు ఎటువంటి సమస్యలు ఉన్నా, నిబంధనలు పాటించక పోయినా ఇంటర్మీడియట్ బోర్డుకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
Tags: Admissions only if the terms apply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *