కౌమార బాలికలకు ఆరోగ్య అవగాహన చాలా అవసరం-జాయింట్ కలెక్టర్ మౌర్య

నంద్యాల ముచ్చట్లు:


నంద్యాల ఐఎంఏ అనుబంధ విభాగం మిషన్ పింక్ హెల్త్ ఆధ్వర్యంలో బుధవారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో కౌమార బాలికల ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు.
మిషన్ పింక్ హెల్త్ విభాగం అధ్యక్షురాలు డాక్టర్ నాగమణి అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో
జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ముఖ్యఅతిథిగా , రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఐఎంఏ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ రవి కృష్ణ గౌరవ అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మౌర్య మాట్లాడుతూ కౌమార బాలికలకు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు, సందేహాలు ఉంటాయని వాటిని నిపుణులు నివృత్తి చేసి సరైన సలహాలు ఇవ్వడం ద్వారా వారు విద్య మీద దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం పెరుగుతుందని అన్నారు. ఐఎంఏ మిషన్ పింక్ హెల్త్ విభాగం ఈ సదస్సులు తరచూ నిర్వహించడం అభినందనీయమన్నారు.

 


డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైద్య అవగాహన సదస్సులకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. బాలికలకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. ఐఎంఏ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ రవి కృష్ణ , మిషన్ పింక్ హెల్త్ అధ్యక్షురాలు డాక్టర్ నాగమణి, కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ ఐఎంఏ అనుబంధ విభాగాలైన మహిళా విభాగం, మిషన్ పింక్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో వైద్య అవగాహన సదస్సులు, గిరిజన, గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాల్ని తరచూ నిర్వహిస్తామని అన్నారు.
ఈ సదస్సులో రక్తహీనత పౌష్టికాహారం అంశంపై స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ శిల్ప, కౌమార బాలికల సాధారణ చర్మవ్యాధులపై చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ సుష్మ,  కౌమార బాలికల మానసిక సమస్యలు వాటిని ఎదుర్కొనే విధానాలపై మానసిక వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఆరిఫా బాను విద్యార్థినులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు.

 

 


    ఈ కార్యక్రమంలో వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ జఫ్రుళ్ళా, ఐఎంఏ నంద్యాల అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ చంద్రశేఖర్, ఐఎంఏ నంద్యాల మహిళా విభాగం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ నర్మదా, డాక్టర్ వసుధ, ఐఎంఏ నంద్యాల మెడికల్ స్పెషాలిటీస్ విభాగం కార్యదర్శి డాక్టర్ హరిత, డాక్టర్ నెరవాటి అరుణ, డాక్టర్ ధనలక్ష్మి, డాక్టర్ శశి కిరణ్, డాక్టర్ మాధవి, డాక్టర్ జాస్మిన్,   కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య ,ఎన్ .సీ .సీ ఆఫీసర్ లలితా సరస్వతి, ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ రమణమ్మ, అధిక సంఖ్యలో విద్యార్థినులు  పాల్గొన్నారు.
కళాశాల, ఐఎంఏ తరపున వైద్యులను, జాయింట్ కలెక్టర్ ను రామకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు.

 

Tags: Adolescent girls need health awareness-Joint Collector Maurya

Leave A Reply

Your email address will not be published.