మరోమారు ఆదరించారు…అభివృద్ధి చేసి చూపిస్తా…

-జొన్నగిరి సర్పంచ్ ఓబులేసు
-లాంఛనంగా రెండవ సారి సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఓబులేసు

Date:23/02/2021

తుగ్గలి  ముచ్చట్లు:

జొన్నగిరి గ్రామ ప్రజలు తనపై నమ్మకం ఉంచి రెండవ సారి జొన్నగిరి గ్రామ సర్పంచ్ గా గెలిపించి ఆదరించారని జొన్నగిరి గ్రామ సర్పంచ్ ఓబులేసు తెలియజేశారు. మంగళవారం రోజున జొన్నగిరి గ్రామ సచివాలయం నందు అధికారుల సమక్షంలో జొన్నగిరి గ్రామ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేశారు.పంచాయతీ కార్యదర్శి నారాయణ స్వామి జొన్నగిరి గ్రామ సర్పంచ్గా ఓబులేసు ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ ఓబులేసు మాట్లాడుతూ జొన్నగిరి గ్రామ ప్రజలు రెండవ సారి జొన్నగిరి గ్రామ సర్పంచ్ గా రెండు వందల పైచిలుకు ఓట్లతో గెలిపించారని,కనుక గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని ఆయన తెలియజేశారు.గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులు మరియు సౌకర్యాలను ఏర్పాటు చేసి జొన్నగిరి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆయన తెలియజేశారు. రెండవ సారి సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా జొన్నగిరి గ్రామ ఉప సర్పంచ్ గా నెల్లూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ రమేష్ కుమార్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నారాయణ స్వామి, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వార్డ్ మెంబర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు బాలన్న,లక్ష్మణ స్వామి,జయరాముడు,టిడిపి కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags: Adopted again … Develop and show …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *