ఎన్నికల నిర్వహణ అద్వాన్నం

 Date:13/04/2019

 విశాఖపట్నం ముచ్చట్లు :
విశాఖలో తెలుగుదేశం నేత, భీమిలి అభ్యర్థి సబ్బం హరి మీడియా తో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, జగన్ కలిసి చంద్రబాబును ఓడించే ప్రయత్నం ఏనాడో ప్రారంభించారు. ఇది ఈ రాష్ట్రానికి మేలు చేయదని నా అభిప్రాయమని అన్నారు.  తెలుగుదేశానికి మద్దతుగా నిలిచాను. భీమిలినుంచి పోటీ చేయాలంటే చేశాను. మహిళలు పూర్తిగా తెలుగుదేశానికి మద్దతు ఇచ్చారు. మధ్యవయస్కులు, పెద్దవారు, ఆలోచించి ఓటు వేసినవారు చంద్రబాబుకే మద్దతు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు చంద్రబాబుకే పట్టం కడతారని నా అంచనా. ఎన్నికలకు డబ్బులు కూడా కావాలి. కానీ డబ్బుంటే చాలు గెలుస్తాం అనే విధానం తప్పు, అసాధ్యమని అయన అన్నారు. ఈ సారి ఎన్నికల నిర్వహణ అధ్వాన్నంగా జరిగింది. ఈవీఎంలు పనిచేయకపోవటం దారుణం. చంద్రబాబు ఎన్నికల కమిషనర్లని తిట్టారంటే అర్ధం ఉంది.  కొత్త రాజధాని నిర్మాణం మామూలు విషయం కాదు. మాటలతో జరిగేది కాదు. అది చంద్రబాబుతోనే సాధ్యం. ఎన్నికల ముందు నేను ఈ మాటలు చెపితే ఓట్లకోసం అంటారు. అందుకే ఎన్నికలు ముగిశాక మాట్లాడుతున్నాను. అమరావతి, పోలవరం రెండు ప్రధానమైన జీవనాడులు. ఆ రెండూ చంద్రబాబు పూర్తి చేస్తారు. వాటిమీద చంద్రబాబును విమర్శించేవారు ఒకసారి ఆ రెండూ చూసి వచ్చి మాట్లాడండి. కేంద్రం కచ్చితంగా ఈ రెంటికీ అడ్డు తగులుతోంది. అందుకే నేను చంద్రబాబు, తెలుగుదేశం పక్షాన ఉండాలని నిర్ణయించుకున్నానని   సబ్బం హరి అన్నారు.
Tags:Advance election management

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *