నేవీలోకి అధునాతన హెలికాప్టర్

విశాఖపట్నం ముచ్చట్లు:


ఇండియన్ నేవీలోకి మరో అధునాతన అడ్వాన్డ్స్ హెలికాఫ్టర్ రెక్కలు కట్టుకొని వాలిపోయింది.ఇండియన్ నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగా నుంచి ఇండియన్ నేవీలోకి అడ్వాన్డ్స్ లైట్ హెలీకాప్టర్ స్క్వాడ్రన్ ఐఎన్ఎఎస్ -324 విమానం ప్రవేశించింది. తూర్పునౌకాదళం వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా ఆధ్వర్యాన ఐఎన్ఎస్ డేగాలో ఘనంగా కమీషనింగ్ వేడుక జరిగింది. దేశీయంగా నిర్మితమై నావికాదళ విధుల్లోకి చేరడం గొప్ప విషయమని గుప్తా పేర్కొన్నారు. ఐఎన్ఎఎస్ 324కు కమడోర్ ఎస్ఎస్ డాష్ కమాండింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. దీనిని ఐఎన్ఎఎస్ 324ను కెస్టరల్స్ గా అత్యున్నత స్ధాయిలో సేవలను అందించేందుకు నేవీ అమ్ముల పొదలో వచ్చి చేరింది.హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేశారు.సెల్ఫ్ ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్స్ సిస్టమ్తో పని చేస్తుంది. సెన్సార్ సమర్థతలను కలిగి ఉంది. తెల్లని, నీలి రంగు అలలపైనా తన పరిశోధనను సమర్థవంతంగా నిర్వహించగలిగే విమానంగా దీన్ని నావికాదళం పేర్కొంది. ప్రకృతి విపత్తుల ఆపరేషన్స్లోనూ మెరైన్ కమాండోస్ సాయంతో కార్యకలాపాలు సాగించనుంది.

 

Tags: Advanced Helicopter into Navy

Leave A Reply

Your email address will not be published.