సేవల్లో మహిళల ముందంజ అభినందనీయం
– కోరమండల్ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు
కాకినాడ ముచ్చట్లు:
సమాజానికి నిరంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కోరమండల్ మహిళా క్లబ్ సేవలు అభినందనీయమని కోరమండల్ ఫెర్టిలైజర్స్ ముఖ్య అధికారి సిహెచ్. శ్రీనివాసరావు పేర్కొన్నారు. రమణయ్యపేట కూరగాయల మార్కెట్ వద్ద కోరమండల్ మహిళా క్లబ్ నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్ర కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించి బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 36 రోజులుగా మిట్ట మధ్యాహ్నం బాటసారుల దాహార్తిని తీర్చడానికి కోరమండల్ మహిళా క్లబ్ సభ్యులు మజ్జిగను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఆర్తులకు, దీనులకు మేమున్నామంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తమ సంస్థకు చెందిన మహిళలు ముందంజలో ఉండడం హర్షనీయమని శ్రీనివాసరావు తెలిపారు. మహిళా క్లబ్ అధ్యక్షురాలయిన సిహెచ్. వెంకట దుర్గావతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మల్లీశ్వరి, శ్రీదేవి, మోహిని, సృజన, విజయలక్ష్మి, అంజుమ్ తదితర మహిళా సభ్యులు పాల్గొన్నారు.

Tags: Advancement of women in services is commendable
