Natyam ad

తితిదే బోర్డులో నేరచరిత్ర ఉన్న వారి పేర్లను పేపర్లలో ప్రకటన ఇవ్వండి – హైకోర్టు

అమరావతి  ముచ్చట్లు:
 
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నేర చరిత్ర ఉన్న 18 మంది సభ్యులుగా కొనసాగటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. తమ నేర చరిత్రపై వివరణ ఇవ్వాలని 18 మందికి హైకోర్టు నోటీసులిస్తే..ఎవరూ కౌంటర్లు దాఖలు చేయలేదని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 15 మంది నోటీసులు తీసుకోగా..మరో ముగ్గురు సభ్యులు నోటీసులు కూడా తీసుకోలేదన్నారు. నోటీసులు తీసుకోని బోర్డు సభ్యులు అల్లూరి మహేశ్వరి, ఎమ్మెల్యే రాం భూపాల్ రెడ్డి, ఎం.ఎన్​ శశిధర్​లపై పిల్ దాఖలైనట్లు పేపర్లలో ప్రకటన ఇవ్వాలని పిటిషనర్​కు హైకోర్టు సూచించింది. అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది.తితిదే బోర్డు సభ్యులు వీరే.. తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామక ప్రక్రియను గతేడాది ప్రభుత్వం పూర్తి చేసింది. 24 మంది సభ్యులతో కూడిన తితిదే కొత్త పాలకమండలి ఏర్పాటు చేసింది. తితిదే సభ్యులుగా పోకల అశోక్‌కుమార్‌, మల్లాడి కృష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కాటసాని రాం భూపాల్‌రెడ్డి(ఎమ్మెల్యే), టంగుటూరు మారుతి ప్రసాద్‌, బుర్రా మధుసూదన్‌ యాదవ్‌(ఎమ్మెల్యే), కలివేటి సంజీవయ్య(ఎమ్మెల్యే), డా.జూపల్లి రామేశ్వరరావు, మన్నె జీవన్‌రెడ్డి, బుదాటి లక్ష్మీనారాయణ, పార్థసారధి రెడ్డి, మురంశెట్టి రాములు, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు(ఎమ్మెల్యే), శ్రీనివాసన్, నందకుమార్‌, శశిధర్‌, విశ్వనాథ్‌రెడ్డి, మిలింద్‌, సౌరభ్‌, కేతన్‌ దేశాయ్‌, రాజేశ్‌ శర్మ, సనత్‌ కుమార్‌, అల్లూరు మల్లేశ్వరి, ఎస్‌.శంకర్‌ పాలకమండలిలో నియామకమయ్యారు. ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా రెవెన్యూ శాఖ కార్యదర్శి(దేవాదాయ), దేవాదాయ శాఖ కమిషనర్‌, తుడా ఛైర్మన్‌, తితితే ఈవో నియామకమయ్యారు. తితిదే బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సుధాకర్‌ నియామకమయ్యారు. వీరిలో 18 మందికి నేర చరిత్ర ఉందని.., వారు తితిదే బోర్డు సభ్యులుగా కొనసాగటానికి వీల్లేదని ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Advertise the names of those with criminal histories on the Titiday Board in the Papers – High Court