హైకోర్టు కోసం న్యాయవాదుల పోరాటం

Advocates fight for the High Court

Advocates fight for the High Court

– మూడవ రోజు విధులు బహిష్కరణ

Date:19/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండు చేస్తూ న్యాయవాదులు చేస్తున్న పోరాటం గురువారం మూడవ రోజు కొనసాగింది. రాయలసీమ న్యాయవాదుల పిలుపు మేరకు రాయలసీమ జిల్లాల్లోని న్యాయవాదులు 17 నుంచి 20 వరకు కోర్టు విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు పులిరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈనెల 20 వరకు న్యాయవాదులు విధులు బహిష్కరిస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండు చేశారు. లేకపోతే ఈ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాయలసీమ అభివృద్ధి కోసం హైకోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. ఇందు కోసం న్యాయవాదులతో కలసి కార్యచరణ ప్రణాళిక చేపట్టి, హైకోర్టు ఏర్పాటు సాధించేంత వరకు పొరాటం ఆగదన్నారు. ఇందు కోసం ప్రతి ఒక్కరు సహకారం అందించాలని కోరారు.

శ్రీ సాయిఆలయాలలో పూజలు

Tags: Advocates fight for the High Court

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *