గోదావరి నది 1986 తరువాత మళ్లీ ఇప్పుడే ఉగ్రరూపం..!!

గోదావరి ముచ్చట్లు:

గోదావరి నదికి  భారత దేశ చరిత్రలోనే ఎంతో విశిష్టమైన స్థానం ఉంది.

ఎన్నో రాజ్యాలు ఈ నది ఒడ్డునే వెలిసి విలసిల్లాయి.
శాతావాహన, కాకతీయ రాజ్యాలు…
గోదావరి తీరంలో పురుడు పోసుకుని..
ఆ గోదావరి సాక్షిగానే చరిత్రలో కలిసి పోయాయి.

గోదావరి నదికి ఒక్కో చోట…
10 నుంచి 20 అడుగుల వెడల్పు ఉంటుంది..
మరో చోట 2 నుంచి 3 కి.మీ వెడల్పు ఉంటుంది.

అడవులు, కొండలు, మైదానాలు నుంచి ఈ నది ప్రవహించి..
బంగాళాఖాతంలో కలిసే ముందు…
ఐదు పాయలుగా విడిపోయి కలుస్తుంది.

ఈ పాయల మధ్య ఏర్పడినవే లంక గ్రామాలు..
గోదావరికి వరద వస్తే ముందుగా మునిగేది లంక గ్రామాలే..!!

మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో ఉన్న..
బ్రహ్మగిరి మౌంటేన్‌ గోదావరి నది జన్మస్థలం.

భారత దేశంలోని …
10 శాతం ఏరియాను ఈ నది కవర్‌ చేస్తుంది.

అంటే ..ఇంగ్లండ్, ఐర్లాండ్ దేశాలతో సమానమైన..
పరివాహక ప్రాంతాన్ని గోదావరి కవర్ చేస్తుంది..!

గోదావరి నది మొత్తం పొడవు 1465 కి.మీ.
3,12,812 కి.మీ మేర …
గోదావరి పరివాహక ప్రాంతం విస్తరించి ఉంది.

మహారాష్ట్రంలో 48.6శాతం, తెలంగాణలో 18.8శాతం..
ఏపీలో 4.5శాతం, చత్తీస్‌గఢ్‌లో 10.9శాతం..
ఒడిశాలో 5.7శాతం ఏరియాను గోదావరి కవర్ చేస్తుంది.

గోదావరి నది పరివాహక ప్రాంతంలో …
ఎన్నో సంస్కృతులు విలసిల్లాయి..
ఎన్నో దేవాలయాలు ఉన్నాయి.
పలు రకాల జీవవైవిధ్యం ఉంది.
ఎన్నో ప్రాజెక్టులున్నాయి.

విచిత్రం ఏమంటే…
గోదావరి నది పుట్టిన బ్రహ్మగిరి పర్వతాలు ..
అరేబియా సముద్రానికి 80 కి.మీ దూరంలోనే ఉంటాయి.

గోదావరికి ప్రతి ఏటా…
110 బిలియన్ క్యూబిక్ ఫీట్ల వరద వస్తుంది..!
దీనిలో 50శాతం నీళ్లను వాడుకునే అవకాశముంది.
గోదావరి ట్రైబ్యునల్ బోర్టు నీటి పంపకాలు చేపడుతుంది.

1986లో గోదావరికి రికార్డు స్థాయిలో..
3.6మిలియన్ క్యూసెక్కుల వరద వచ్చింది.

మళ్లీ..ఇప్పుడు గోదావరి పెద్ద వరద వచ్చింది..
భద్రాచలం దగ్గర 72 అడుగులను టచ్ చేసింది.

దీంతో..ధవళేశ్వరం నుంచి…
లక్షల క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలయ్యాయి.

పోలవరం పూర్తై ఉంటే ..
197 టీఎంసీలు నిల్వ చేసుకునే అవకాశముండేది.
కానీ…చంద్రబాబు పాపాలు ..
పోలవరానికి శాపాలై ప్రాజెక్టు పూర్తి కాలేదు.

గత ప్రభుత్వంలోని పెద్దలు కమీషన్లకు కక్కుర్తి పడి…
ప్రణాళిక లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టారు.
దీంతో…రూ.400కోట్లతో కట్టిన కాఫర్ డ్యామ్ కొట్టుకు పోయింది.
దీని మీద చంద్రబాబు మాట్లాడరు ..
ఎల్లో మీడియా మాట్లాడదు..!

జులై 12నే గోదావరి వరదపై సీఎం జగన్ సమీక్ష చేశారు.
ఆయా జిల్లాల కలెక్టర్లను అలర్ట్ చేశారు.
గోదారమ్మ ఉగ్రరూపాన్ని ముందే అంచనా వేసి..
ప్రాణ నష్టం జరగకుండా చూశారు.

ఏరియల్ సర్వే చేసి..
సహాయక కార్యక్రమాలపై అధికారులకు పూర్తి స్వచ్ఛనిచ్చారు.

అంతేకాదు…
లంక గ్రామాల ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు.
సహాయక శిబిరాలకు తరలించి..
అన్ని విధాలుగా మంచిగా చూసుకుంటున్నారు.

అంతేకాదు..
బాధితులకు రూ.2వేలు చేతులో పెట్టి పంపుతున్నారు.

ఇంత చేస్తుంటే కూడా..
చంద్రబాబు వరదలో బురద రాజకీయాలు చేస్తున్నారు.

వరద ప్రాంతాల్లో..
పరామర్శ పేరుతో రాజకీయ ర్యాలీలకు తెరలేపారు.

14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు..
గోదారమ్మ చరిత్ర తెలియదని అనుకోవాలా..?

1986 తరువాత ఇంత పెద్ద వరద వస్తే..
40 ఏళ్ల అనుభవం ఉందని…
చెప్పుకునే వ్యక్తి చేయాల్సిన పనులు ఇవేనా..?

 

Tags: After 1986, Godavari river is now raging again..!!

Leave A Reply

Your email address will not be published.