పెళ్లయిన తర్వాత వదలని పగ

Date:14/03/2018
పాలమూరు  ముచ్చట్లు:
పదో తరగతి చదువుతున్న సమయంలో తన ప్రేమని నిరాకరించిందని.. పగ పెంచుకున్న ఓ వ్యక్తి ఆమె గృహిణిగా మారాక బెదిరించి ఆమెపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచారం చేయడమే కాకుండా గతంలో ఆమెకి తెలియకుండా తీసిన నగ్న ఫొటోల్ని చూపించి సుమారు రూ. 2.50 లక్షలను నిందితుడు కాజేశాడు. వేధింపులు తీవ్రతరం కావడంతో ధైర్యం చేసిన బాధితురాలు షీ టీమ్‌ని ఆశ్రయించడంతో ఆ కామాంధుడు కటకటాలపాలయ్యాడు.మీర్‌పేట సీఐ మన్మోహన్ తెలిపిన కథనం ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలానికి చెందిన రవి.. గతంలో కల్వకుర్తిలోని పాఠశాలలో పదో తరగతి చదివాడు. ఆ సమయంలోనే తన సహచర విద్యార్థినిపై ప్రేమని వ్యక్తపరచగా.. బాలిక తిరస్కరించింది. అనంతరం ఆమెకి 2014లో కుటుంబ సభ్యులు పెళ్లి చేయగా.. ప్రస్తుతం బాధితురాలు భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి బడంగ్‌పేట్ నగరపంచాయతీ పరిధిలో నివాసం ఉంటోంది. హాయిగా సాగిపోతున్న ఆమె జీవితంలో మళ్లీ రవి ప్రవేశించాడు. గత ఏడాది ఆమె నెంబరుని సంపాదించిన రవి.. తనతో మాట్లాడాలని అప్పటి నుంచి వేధించడం మొదలెట్టాడు. ఒకప్పటి సహచర విద్యార్థి వేధింపులు భరించలేక గృహిణి అతని ఫోన్ నెంబరుని బ్లాక్ చేసింది. దీంతో.. వేధింపులు తీవ్రతరం చేసిన రవి.. మరో నెంబరు నుంచి ఫోన్ చేసి.. గతంలో ఆమెకి తెలియకుండా తీసిన నగ్న ఫొటోల్ని పంపించాడు. తనతో చనువుగా ఉండకపోతే.. అవి భర్తకి పంపిస్తానని బెదిరించాడు. ఆ ఫొటోల్ని డిలీట్ చేయాలంటే.. పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని డిమాండ్ చేయగా.. భర్తకి తెలియకుండా ఆమె తన వద్ద ఉన్న రూ. 2.50 లక్షలను అతనికిచ్చింది. అయినప్పటికీ.. ఆ ఫొటోల్ని డిలీట్ చేయని రవి.. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని.. అప్పుడు నీ ముందే ఆ ఫొటోల్ని డిలీట్ చేస్తానన్నాడు.రవి మాటలను నమ్మిన గృహిణి.. గత జనవరి 18న కల్వకుర్తిలోని హనుమాన్ దేవాలయం వద్దకు వెళ్లింది. ఆ సమయంలో ఆమెని బెదిరించి.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన నిందితుడు.. ఆమెని కొట్టి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం కూడా అతని వేధింపులు ఆగకపోవడంతో.. బాధితురాలు షీ టీమ్‌ని ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన షీ టీమ్ పోలీసులు నిందితుడు రవీని అరెస్టు చేసి.. నిర్భయ చట్టం ప్రయోగించారు.
Tags: After a marriage is a revenge

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *