ఎన్నికల తరువాత మజ్లీస్, తెరాసలుండవు :  అమిత్ షా

Date:10/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
మతం ఆధారంగా రిజర్వేషన్లు బీజేపీ ఒప్పుకోదు. ప్రజలను రెచ్చగొట్టడానికి… మమత, కమ్యూనిస్ట్ లు ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేసారు.హైదరాబాద్ ఎగ్జీబీషన్ మైదానంలో అయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.  రోహింగ్యా లు వస్తే, కనీసం ఇక్కడి ప్రజల కోసం కూడా కేసీఆర్ ఆలోచన చెయ్యలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే, కొడుకులు, కూతుళ్లు అధికారంలో ఉండరు. ఆరు నెలల ముందే, ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది. 2019 లో మోడీ గాలిలో కేసీఆర్ కొట్టుకుపోతా అని భయం తో కేసీఆర్, ముందస్తు కు వెళ్ళాడని అయన అన్నారు. ఎన్నికల తరువాత..కొడుకును, లేదా బిడ్డను సీఎం చేయడానికే కేసీఆర్ ముందస్తు కు వెళ్లాడన్నారు. ప్రజల కోసం ఎన్నికలకు వెళ్ళలేదు.
కేసీఆర్ ఒకప్పుడు యూపీయే సర్కార్ లో మంత్రిగా.. ఉన్నారు. 13 వ ఆర్థిక సంఘం లో 16,597 కోట్లు మాత్రమే తెలంగాణ కు వచ్చాయి. ఇప్పుడు 14 వ ఆర్థిక సంఘం లో 1,15,605 కోట్లు తెలంగాణ కు వచ్చాయి. ఇదేనా  మోడీ  తెలంగాణ కు చేసిన అన్యాయమని అన్నారు.గడిచిన సమయం గడిచింది. ఉన్న సమయం వినియోగించుకోవాలి. కార్యకర్తల సహాయంతో బీజేపీ ఇంత ఎత్తుకు ఎదిగింది. మణిపూర్ ఉదాహరణ  ఇక్కడ చెప్పాలి. ఒక్క శాతం వోట్ కూడా లేని  చోట అధికారంలోకి వచ్చాం. అసాం, త్రిపుర, మణిపూర్ కన్నా తెలంగాణ లో బీజేపీ బలంగా ఉంది అక్కడ గెలిచిన మనం ఇక్కడ గెలవలేమా అని అన్నారు. ఇక్కడ సర్కార్ 5 సంవత్సరాలు,  కుటుంబం కోసమే పని చేసింది ప్రజల కోసం కాదని అన్నారు. బీజేపీ అబివృద్ది కోసం సర్కార్.. ఏర్పాటు చేస్తుంది. కుటుంబం కోసం కాదు. మజ్లీస్ చెప్పినట్టు కేసీఆర్ ప్రభుత్వం నడుస్తోంది. ఎన్నికల కౌంటింగ్ తర్వాత తెలంగాణ లో మజ్లీస్, తెరాస ఉండవని అన్నారు.
Tags:After the election, the majlis, the absence of: Amit Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *