మళ్లీ తెరపైకి సుంకర సుజాత

Again on the screen is Sunkara Sujatha

Again on the screen is Sunkara Sujatha

Date:23/11/2018
ఖమ్మం ముచ్చట్లు:
టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ, ఖమ్మం నియోజకవర్గం ప్రజాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై ఓ మహిళ చేసిన ఫిర్యాదు కలకలం రేపుతోంది. నామా నాగేశ్వరరావు నామినేషన్‌లో తనను కొట్టినట్టు పేర్కొనలేదని హైదరాబాద్‌కు చెందిన సుంకర సుజాత ఆరోపించారు. నామా తనను తిట్టినట్టు, భయపెట్టినట్టు మాత్రమే నామినేషన్ పత్రాల్లో తెలిపాడని.. బ్లాక్‌ మెయిలింగ్ చేసినట్టు, తనను కొట్టినట్టు ఆరోపణలు ఎదుర్కోవడం గురించి పేర్కొనలేదని ఆమె తెలిపారు. ఆయన వల్ల తనకు లైఫ్ థ్రెట్ ఉన్న విషయం కూడా అందులో రాయలేదని చెప్పారు. ఖమ్మం నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి (తహశీల్దార్)కి ఫిర్యాదు చేశారు. నామా తనను కొట్టినందుకు 354 సెక్షన్ కింద కేసు పెట్టానని.. దాన్ని నామినేషన్ పత్రాల్లో వెల్లడించలేదని సుంకర సుజాత ఆరోపిస్తున్నారు. ఆయన 506, 509 సెక్షన్లకు సంబంధించినవే నామినేషన్‌లో పేర్కొన్నారని.. 354కు సంబంధించినవి రాయలేదని తెలిపారు.
అందుకే దానికి సంబంధించిన ఫిర్యాదును రిటర్నింగ్ అధికారికి ఇవ్వడానికి వచ్చినట్టు మీడియాకు చెప్పారు. సుజాత మీడియాతో మాట్లాడుతుండగా మిక్కిలినేని నరేంద్ర అనే వ్యక్తి కల్పించుకున్నారు. ఆయనపై కూడా సుజాత సంచలన ఆరోపణలు చేశారు. నరేంద్ర తనకు అర్ధరాత్రుళ్లు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని, ఆయన మీద కూడా కేసు వేశానని తెలిపారు. దానిపై పోలీసులు చార్జ్‌షీట్ వేశారని చెప్పారు. టీడీపీ నేత నామా నాగేశ్వరరావు తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ సుంకర సుజాత అనే మహిళ గతంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నామాపై ఆమె సంచలన ఆరోపణలు చేయడంతో ఈ అంశం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
తన నగ్న చిత్రాలను బయటపెడుతానంటూ నామా తనను వేధింపులకు గురిచేస్తున్నారని సుజాత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నామా నాగేశ్వరరావు ఒక సెక్స్ ఉన్మాది అని, వావి వరసలు లేని కామాంధుడని సుజాత ఘాటు ఆరోపణలు చేశారు. తల్లులతో సంబంధం పెట్టుకుని కూతుళ్లపైనా కన్నేసే నీచుడ నామా అని బాంబు పేల్చారు. ఆయన ఫేస్‌బుక్ నిండా వేశ్యల ఫోన్ నెంబర్లే ఉంటాయని, నామా చరిత్ర మొత్తం సాక్ష్యాధారాలతో పాటు నిరూపిస్తానని తెలిపారు. సుజాత ఆరోపణలకు సంబంధించి అప్పట్లో ఓ వీడియో టేపు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. నామాపై తాను పెట్టిన కేసు ఉపసంహరించుకోమని తనను బెదిరిస్తున్నారని సుజాత ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని పేర్కొన్నారు. నాటి నుంచి తనను వేధిస్తున్నట్లు ఆమె ఆరోపిస్తున్నారు. ఎన్నికల వేళ ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.
Tags:Again on the screen is Sunkara Sujatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *