మళ్లీ శ్రీధర్ బాబు తోనే చిన్న ఓదాలలో అభివృద్ధి

Again, Sridhar Babu develops in small sessions

Again, Sridhar Babu develops in small sessions

Date:24/11/2018
మంథని ముచ్చట్లు:
మంథని మండలంలోని చిన్న ఓదాల గ్రామంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇంటింటికి తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి మాజీ మంత్రి శ్రీధర్ బాబును  మంథని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ప్రచారం చేసారు.  ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు గ్రామ ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టో ను చూపించుకుంటూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ నాగుల రాజయ్య మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి మన ప్రియతమ నాయకుడు మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారిని గెలిపించుకుని మన ఊరు సమస్యలు నెరవేర్చు కుందామని  ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాజీ మంత్రి  శ్రీధర్ బాబు 40 లక్షల సీసీ రోడ్లు వేయించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మనప్రాంతం అభివృద్ధి చెందిందని అయన అన్నారు. మాట్లాడారు. మాజీ మంత్రి శ్రీధర్ బాబు రాక కోసమే ప్రజలు  వేచి చూస్తున్నారని  చెప్పారు .టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇచ్చిన హామీలు , పథకాలు ప్రతి ఒక్కటి పూర్తి స్థాయిలో నెరవేరుస్తుందని ప్రచారం చేస్తూ ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ రమేష్ ,ఆదిత్య యూత్ కాంగ్రెస్ మండల సెక్రెటరీ కిషోర్ రెడ్డి ,మాజీ ఉపసర్పంచ్ లింగాల చిన్న ఆశాలు, ఇతర మాజీ వార్డు సభ్యులు యువజన యూత్    అధ్యక్షుడు వేముల శ్రావణ్, మేూతుకు రాజబాపు, రాజు, మల్లేష్ నరేష్, కమల్, రాజేందర్ రాకేష్ ,శేఖర్  ,మొగిలి ,చందు ఇతర కాంగ్రెస్ యూత్ నాయకులు ,కార్యకర్తలు ,మహిళలు పాల్గొన్నారు.
Tags:Again, Sridhar Babu develops in small sessions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *