మళ్లీ బెంగాల్ వర్సెస్ కేంద్రం

కోల్ కత్తా  ముచ్చట్లు:

పేరుకే పేరున్న పిల్ల‌లు ఎదుర‌యితే నీ పేరు, నా పేరు ఒక‌టే అని న‌వ్వుకుంటారు, స్నేహితులూ అవుతారు. ఒకే లాంటి డ్ర‌స్‌ వేసుకున్న‌వారి విష‌యంలోనూ అదే జ‌ర‌గ‌వ‌చ్చు. కానీ కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం బెంగాల్ విష‌యంలో ఆగ్ర‌హించింది. కేంద్రం ప‌థ‌కాల‌నే పేరు మార్చి అమ‌లు చేస్తున్నారంటే ప‌శ్చిమ బెంగాల్ మీద కారాలు మిరియాలూ నూరుతోంది మోదీ ప్ర‌భుత్వం. అంతేకాదు అస‌లా ప‌థ‌కాల‌కు ఇవ్వాల్సిన నిధుల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇంత‌కంటే అన్యాయం మ‌రోటి వుంటుందా
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) పథకాల యాక్షన్ ప్లాన్ వివరించి. అమలు కోసం నిధులు మంజూరు చేయాలని జనవరి, 2022లో కేంద్రాన్ని ప‌శ్చిమ‌ బెంగాల్ ప్రభుత్వం కోరింది. పిఎంఏవై కింద రూ.4,900 కోట్లు, రూ.2,700కోట్లు ఇవ్వాలని కోరింది. కానీ ఈ పథకాల అమలుపై కొన్ని సందేహాలున్నాయ‌ని  కేంద్రం అడ్డుపుల్ల వేసింది. పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తున్నార‌ని, వాటికి  సంబంధించిన వివరాలు ఇవ్వండి అంటూ బెంగాల్ ప్రభుత్వానికి సమాచారం పంపింది కేంద్రం. హౌరా పట్టణంలోని బెంగాల్ ప్రభుత్వ తాత్కాలిక సచి వాలయ భవనం నబన్నాను వివరాలు ఇవ్వాలని తన లేఖలో కోరింది.ప‌శ్చిమ‌ బెంగాల్ లో పిఎంఎవై ప‌థ‌కాన్ని బంగ్లా ఆవాస్ యోజన గా.. స్వచ్ఛ భారత్ మిషన్, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకాలను నిర్మల్ బంగ్లా మిషన్, బంగ్లా సడ‌క్‌ యోజనగా మార్చి అమలు చేస్తున్నా రు. ఇలా పలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి అమలుచేస్తున్న బెంగాల్ ప్రభుత్వానికి  ఈ పరిణా మంతో ఝలక్ తగిలినట్టయింది. ఏటా మార్చి చివర్లో, ఏప్రిల్ మొదటి వారంలో  నిధులు మంజూరయ్యేవి.  ఈసారి మాత్రం కేంద్రం ఎన్నో అనుమానాలు  వ్య‌క్తంచేసిందని ఆ ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు.

 

 

 

2023లో పంచాయతీ ఎన్నికలు ఉండటంతో ఏం చేయాలనే దానిపై బెంగాల్ ప్రభుత్వం ఆలోచనలో పడింది.కేంద్రం పథకాలు, నిధులు, అమలు అంశాలపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనూ రాజకీయ కాక ర‌గులుతోంది. ముఖ్యంగా తెలంగాణలో బలంగా, వేగంగా ఎదుగుతున్న బీజేపీ, అధికార టీఆర్ఎస్ మధ్య ఈ విషయంలో పదే పదే మాట‌ల యుద్ధం నడుస్తోంది. తెలంగాణలో పథకాలు-కేంద్రం వాటాలపై ప్రతి రోజూ వాడీ వేడి చర్చ జరుగుతూనే ఉంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం నుంచి వచ్చే నిధులతో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టి కేవలం  కేసీఆర్ పేరు ఒకటే పెట్టుకుంటున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.  నగరాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం అమృత్ స్కీమ్ కింద ఇచ్చే నిధులను మిషన్ భగీరథ కోసం తెలంగాణ సర్కారు వాడుకుంటోందని వాదిస్తోంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి రైతు వేదికలు, గ్రామాల్లో పార్కుల అభివృద్ధిలోనూ  కేంద్రం డబ్బులున్నాయనేది  బీజేపీ ఆరోపణ. ఐతే.. బీజేపీ నేతలకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటరిస్తూ వస్తున్నారు. తెలంగాణ పథకాలనే కేంద్రం కాపీ కొడుతోందని.. మిషన్ భగీరథ ను హర్ ఘర్ జల్ పేరుతో అమలు చేస్తోందని కేసీఆర్  ఆరోపించారు.ఆంధ్రాలోనూ సీఎం జగన్ తన ప్రాభ‌వం కోసం అనేక పథకాలను తండ్రి వైఎస్ఆర్ పేరు మీద, తన పేరు మీద అమలు చేస్తున్నారు. నవరత్నాలు, జగనన్న అమ్మ ఒడి, మన బడి నాడు –నేడు,

 

 

 

 

Post Midle

సర్వ శిక్షా అభి యాన్ లో భాగంగా ‘జగనన్న విద్యా కానుక, మధ్యాహ్న భోజనం స్కీమ్ లో భాగంగా జగనన్న గోరుముద్ద , సంక్షేమ వసతి గృహాల పథకంలో భాగంగా జగనన్న వసతి దీవెన లను అమలు చేస్తున్నారు.ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్ మిషన్  అమలులో కేంద్రం   వాటా 60శాతం. మిగతా 40 శాతం ఖర్చును రాష్ట్రాలు భరిస్తున్నాయి.సంక్షేమ, మౌలిక వసతుల రంగాలకు కేటాయింపులతోనే జనాన్ని ఎక్కువగా ఆకర్షించొచ్చన్న అంచనాతో.. కేంద్రం అమలు చేస్తున్న చాలా సంక్షేమ ప‌థ‌కాల్లో పలు రాష్ట్రాలు తమ వాటాను, కేటాయింపులను భారీగా పెంచి.. సోంత పేర్లతో అమలు చేస్తున్నాయి. ఒకప్పు డు కేంద్ర సంక్షేమ పథకాల్లో ఖర్చుల వాటా 60:40శాతంగా ఉండేది. నేడు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తెచ్చి మరీ ఆ స్కీముల్లో డబ్బులు కుమ్మరించి పంపిణీకి  సిద్ధ‌ప‌డ‌టంతో  రాష్ట్రాల వాటా 90 శాతం అన్న ట్టుగా మారిపోయింది. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లను కేసీఆర్, జగన్ భారీగా పెంచేశారు. కొన్ని పథకాల్లో కేంద్రం వాటా నామమాత్రమే అన్నట్టుగా సీన్ మారింది. కేంద్రం ప్రశ్నించినా,నిధులు ఆపేసినా, రాష్ట్రాలే అప్పులు చేసో, ఆస్తులు అమ్మో ఆ పథకాల అమలును కొనసాగించి, ఓట్లు రాబట్టుకోవా లనుకునే విపరీత పరిస్థితి  దేశం అంత‌టా కనిపిస్తోంది.

 

Tags: Again vs Bengal Center

Post Midle
Natyam ad