ఆగమోక్తంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహాసంప్రోక్షణ
– భక్తులకు దర్శనం ప్రారంభం
తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి కపిలతీర్థంలో గల పురాతన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహాసంప్రోక్షణ ఆదివారం ఆగమోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభప్రదక్షిణ చేపట్టారు. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య మిథున లగ్నంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి కళావాహన, మహాసంప్రోక్షణ నిర్వహించారు. ఆ తర్వాత భక్తులకు దర్శనం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, కంకణభట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, డెప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ పాల్గొన్నారు.
Tags; Agamoktanga Sri Lakshminarasimhaswamy Temple Mahasamprokshan
