మణిరత్నం విజువల్ వండర్ ‘పొన్నియిన్ సెల్వన్ 2’ నుంచి ‘ఆగనందే ఆగనందే..’ పాట విడుదల
హైదరాబాద్ ముచ్చట్లు:
ప్రియుడి ప్రేమలో చోళ రాజ్యపు యువరాణి మైమరచిపోతుంది. అతన్ని చూసినా, తలుచుకున్నా ముఖంలో చిరునవ్వు విచ్చుకుంటుందని ఆమె తన మనసులో ప్రేమను ‘ఆగనందే ఆగనందే’ అంటూ అందమైన పాట రూపంలో పాడుకుంకుంటుంది. ఆ చోళ రాజ్యపు యువరాణి ఎవరో కాదు.. కుందవై , ఆమె ప్రియుడు వల్లవరాయుడు. కుందవిగా త్రిష, వల్లవరాయుడిగా కార్తి సిల్వర్ స్క్రీన్‌పై మెప్పించనున్నారు. అసలు వారి మధ్య ప్రేమకు కారణమేంటో తెలుసుకోవాలంటే ‘పొన్నియిన్ సెల్వన్ 2’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మణిరత్నం, సుభాస్కరన్.
ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం ఆవిష్కరిస్తోన్న విజువల్ వండర్ `పొన్నియిన్ సెల్వన్ 2`. ప్రముఖ నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్‌పై సుభాస్కరన్, మణిరత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గత ఏడాది సెన్సేషనల్ హిట్ అయిన హిస్టారికల్ మూవీ పొన్నియిన్ సెల్వన్ 1కి కొనసాగింపుగా పొన్నియిన్ సెల్వన్ 2 తెరకెక్కుతోంది. రెండో భాగంపై హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో `పొన్నియిన్ సెల్వన్ 2` రిలీజ్‌కి సన్నద్ధమవుతుంది.

సోమవారం ఈ సినిమా నుంచి ‘ఆగనందే ఆగనందే’ అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ ఈ పాటను కంపోజ్ చేసి అందించారు. ఆనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను శక్తిశ్రీ గోపాలన్ శ్రావ్యంగా ఆలపించారు. అత్యద్భుతమైన కోటలు, అంతకు మించిన కథ, కథనం, అందులో రాజతంత్రం, ఒకరికి ముగ్గురు హీరోలు, స్క్రీన్ నిండుగా హీరోయిన్లు అంటూ వేరే లెవల్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో తెరకెక్కుతోంది పొన్నియిన్ సెల్వన్2. విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్యారాయ్, త్రిష, జయరామ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్‌గా ఈ పాన్ ఇండియా మూవీ తమిళ్ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
Tags; ‘Aganande Aganande..’ song released from Mani Ratnam’s visual wonder ‘Ponniyin Selvan 2’
