Agastheeswaraswamy chariot festival with devotion

భక్తి శ్రద్దలతో అగస్తీశ్వరస్వామి రథోత్సవం

– మిరియాలు, ఉప్పు వేసి మొక్కలు చెల్లింపు
– శివనామస్మరణతో మారుమ్రోగిన కొండ

Date:23/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

మహాశివరాత్రి సందర్భంగా శ్రీ అగస్తీశ్వరస్వామి రథోత్సవం నెక్కుంది కొండలపై వైభవంగా సాగింది. భక్తులు శివనామస్మరణతో ఉప్పు, మిరియాలు రథంపై చల్లి మొక్కలు చెల్లించుకున్నారు. ఆదివారం సాయంత్రం నెక్కుంది కొండలపై వెలసిన స్వామివారి రథోత్సవాన్ని వేదపండితులు సుందరంగా అలంకరించారు. సుమారు 20 గ్రామాలకు చెందిన ప్రజలు స్వామివారి రథోత్సవాన్ని తాళ్లతో పట్టుకుని ఈడ్చూతూ కొండపై ప్రదక్షణలు చేశారు. హరహరమహదేవ శంభోశంకర అంటు భక్తులు అత్యంత నియమ నిష్టలతో స్వామివారికి పూజలు చేసి, వెహోక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే పట్టణంలోని శ్రీ బోగంజుండేశ్వరస్వామి ఆలయం, కోనేటి వద్ద గల శ్రీ కాశీవిశ్వేరస్వామి ఆలయం, నగరిలో వెలసిన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయలం, యాబైరాళ్ల వెహోరవేశ్వరస్వామి ఆలయం, భీమగానిపల్లెలో గల భీమేశ్వరస్వామి ఆలయాలలో భక్తుల రద్దీతో క్రిక్కిరిసిపోయింది. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

భారత్‌బంద్‌ పాక్షికం

Tags: Agastheeswaraswamy chariot festival with devotion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *