Natyam ad

పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు  5 సంవత్సరాలు వయోపరిమితి పెంచాల్సిందే

-నిరుద్యోగులకు నష్టం కలిగిస్తే సహించేది లేదు

-కలెక్టరేట్ వద్ద ఏఐవైఎఫ్ ఆందోళన

కడప ముచ్చట్లు:

Post Midle

పోలీసు ఉద్యోగ వయోపరిమి తి ఐదు సంవత్సరాలు పెంచాల్సిందేనని పరీక్ష గడువు మూడు నెలలు గడువు ఇవ్వాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి దస్తగిరి,వి.గంగా సురేష్  లు కోరారు  గురువారం బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన గా వచ్చి కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు  ఈసందర్భంగావారు మాట్లాడుతూ పోలీసు శాఖలో ప్రతి ఏటా 6,500 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు మాట ప్రకారంమూడుసంవత్సరాలు కలిపి 19500 ఉద్యోగాలూ భర్తీ చేయాల్సి ఉన్నప్పటికి పట్టబద్రుల, ఉపాధ్యాయ   శాసనమండలి ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో  6511  పోలీసుఉద్యోగ నియామకాల  కోసం  ప్రకటన (నోటిఫికేషన్  ) ఇచ్చారని అయితే వయోపరిమితి    ఎస్ ఐ కి 21 నుండి 27 సంవత్సరాలు పోలీస్ కానిస్టేబుల్ కి  18నుండి 24వరకు ( ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, ఏడబ్ల్యూఎస్ వారికి ఐదు సంవత్సరాలు వయోపరిమితి సడలింపు) గా నిర్ణయించడం బాధాకరమన్నారు  .

 

 

పోలీసు ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తూ కోచింగ్ సెంటర్లలో, అద్దె గదులలో ఉండి పరీక్షలకు సన్నద్ధం అవుతూ,  నిరంతరం సాధన చేస్తున్న అభ్యర్థుల ఆశలు నిరాశలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసు అభ్యర్థుల కష్టం వృధా కాకుండా వారికి న్యాయం చేసే విధంగా వయోపరిమితి ఐదు సంవత్సరాలు పెంచాలని కోరారు.ప్రతి సంవత్సరం జనవరి 1 వతేదీ ఉద్యోగ నియామకాల కాలపట్టిక (జాబ్ క్యాలెండర్ )విడుదల చేస్తామని చెప్పి చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారన్నారు    గోరు చుట్టు పై రోకలి పోటులాగా ఉద్యోగులు ఎవరు అడగకపోయినా  ఉద్యోగ విరమణ వయసు 60 సంవత్సరాల నుండి 62 వరకు   పెంచడం నిరుద్యోగులకు తీవ్ర నష్టం కలిగించిందన్నారు  .

 

 

 

క్రమంగా ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం ఉద్యోగ విరమణ వయసు 62  సంవత్సరాలకు పెంచారు కాబట్టి వయోపరిమతి 5 సంవత్సరాలు పెంచి పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని  కోరారు ముఖ్యమంత్రి కడప జిల్లా పర్యటన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని  హెచ్చరించారు ఈ ఆందోళన కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు రాహుల్ దేవ్ , నగర కార్యదర్శి చైతన్య, జిల్లా కార్యవర్గ సభ్యులు జి నాగరాజు , తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Age limit should be increased by 5 years for police job candidates

Post Midle