అగ్గిపుల్ల  చేబుతోంది

Date:27/03/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలకు ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. అయితే, చాలామంది దీన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. మాస్క్ పెట్టుకుని తిరిగితే సరిపోతుందని భావిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే, ఒక్క అగ్గిపుల్ల వీడియో.. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజెబుతోంది. ఒక్కరు అప్రమత్తంగా ఉంటే వందలాది ప్రాణాలను కాపాడినవాళ్లం అవుతామని, ప్రజలు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలనే సందేశాన్ని అందిస్తోంది.

 

ఈ వీడియోలో కొన్ని అగ్గిపుల్లలు లైనుగా నిలుచుని ఉన్నాయి. వాటిలో అగ్గి పుల్లకు మంట పెడితే.. అది వరసగా పక్కన ఉన్న అగ్గిపుల్లలను కూడా మండిస్తూ ఆ మంటను వ్యాప్తి చేస్తోంది. అయితే, వాటిలో ఉన్న ఓ తెలివైన అగ్గిపుల్ల ఆ మంట తనకు అంటుకోకుండా పక్కకు తప్పకుంది. అంతే, ఆ మంట ఆ అగ్గిపుల్ల వద్దే ఆగిపోయింది. ఒక్క అగ్గిపుల్ల పక్కకి తప్పుకోవడం వల్ల మిగతా అగ్గిపుల్లలు తమ మండిపోకుండా క్షేమంగా ఉన్నాయి.

 

వీడియో చూసిన తర్వాత మీకు తప్పకుండా ఒక విషయం అర్థమయ్యే ఉంటుంది. ఒక అగ్గిపుల్ల అప్రమత్తంగా ఉండటం వల్ల ఆ మంట మిగతా అగ్గిపుల్లలకు అంటుకోకుండా అగిపోయింది. కరోనా వైరస్ కూడా అలాంటిందే. మనం బయటకు వెళ్తే.. బాధితుల నుంచి ఆ వైరస్ మనకు సోకే ప్రమాదం ఉంది. అది మన నుంచి కుటుంబ సభ్యులకు ఆ తర్వాత మరికొందరికి వ్యాప్తిచెంది పరిస్థితులు దయనీయంగా మారతాయి. ఏ ఒక్కరు అప్రమత్తంగా ఉన్నా ఈ వైరస్ మధ్యలోనే ఆగిపోయి అంతమవుతుంది. లేకపోతే.. ఇతరులకు సోకి వారిలోనూ జీవిస్తూ తన ఉనికిని చాటుతోంది. మనిషికి మనిషికి మధ్య కనీసం 2 మీటర్ల దూరం ఉండాలి. కాబట్టి.. కరోనాను అంతం చేసే సత్తా మనలోనే ఉంది. కాబట్టి.. జాగ్రత్తగా ఉండండి.

పేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Tags: Aggupalla is doing it

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *