మున్సిపల్ ముందు ఆందోళన

వికారాబాద్ ముచ్చట్లు:

వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని పదో వార్డు కు చెందిన కాలనీవాసులు మున్సిపల్ కార్యాలయాన్ని  ముట్టడించారు.13 రోజులుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నామని  మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా  నీటి సమస్యను తీర్చడం లేదని మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించినట్లు కాలనీవాసులు తెలిపారు. మున్సిపల్ అధికారులకు నీటి సమస్యలు తీర్చాలని ఎన్నిసార్లు వేడుకున్నా కనికరిస్తలేరని కాలనీవాసులు వాపోతున్నారు.విద్యుత్ సమస్య రోడ్డు సమస్య నీటి సమస్య కనీసం చెత్త బండి కూడా రావడం లేదని తమ సమస్యలు తీర్చాలని నీటి బిందెలతో మున్సిపల్ కార్యాలయం ముందు ముట్టడించి ఆందోళనకు దిగినట్లు కాలనీవాసులు కౌన్సిలర్ తెలిపారు. విషయం తెలుసుకొని మున్సిపల్ కౌన్సిలర్ అశోక్ మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చెందుతున్న సముదాయించే ప్రయత్నం ఈ విషయం తెలుసుకొని మున్సిపల్ కౌన్సిలర్ అశోక్ మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చెందుతున్న సముదాయించే ప్రయత్నం చేశారు. మా నీటి సమస్య తీరాకే ఇక్కడి నుండి వెళ్తామని మున్సిపల్ చైర్మన్ అశోక్ తో వాగ్వాదానికి దిగారు.

 

Tags: Agitation before the Municipal

Leave A Reply

Your email address will not be published.