వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలి

-ఈ నెల 8న భారత్ బంద్ ను జయప్రదం చెయ్యండి

Date:05/12/2020

ఆదోని  ముచ్చట్లు:

త నెల 26వ తేదీ నుండి నేటి వరకు పార్లమెంటులో ఆమోదంలో పెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అఖిలభారత కిసాన్ సభ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది .ఈ కార్యక్రమంలో హర్యానా ఉత్తర ప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున రైతులు చలో ఢిల్లీ కార్యక్రమానికి వస్తున్న సందర్భంగా బిజెపి ప్రభుత్వం రైతుల పైన పాశవికంగా దాడులకు పాల్పడిందని అయితే రైతులు శాంతి నిరసన పోరాటం చేయడంలో వెనక్కి తగ్గేది లేదని దృఢ సంకల్పంతో కదం కదం తొక్కుతూ  దేశ రాజధాని ముట్టడి కోసం  రైతులు  చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఆరో తేదీ  రైతు సంఘాలు  ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని  రైతు సంఘాల కోఆర్డినేషన్ కమిటీ నాయకులు  రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే వెంకటేశ్వర్లు  ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు  లక్ష్మి రెడ్డి ఏ ఐ కె ఎమ్ ఎస్ జిల్లా నాయకులు మల్లికార్జున  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి డి రామాంజనేయులు

 

 

సి ఐ టి యు  జిల్లా ఉపాధ్యక్షులు పి  ఈరన్న సి ఐ టి యు పట్టణ కార్యదర్శి గోపాల్ సిపిఐ నాయకులు గోపాల్ అయ్యప్ప గౌడ్ ఐఎఫ్టియు నాయకులు నా వెంకన్న ఐ ఎఫ్ టి యు నాయకులు తిక్కన్న, పీవోడబ్ల్యూ మహిళా సంఘం నాయకురాలు మణి, లు మాట్లాడుతూ రైతుల పరిపాలన అంటూ చెప్పుకునే ప్రభుత్వాలు నేడు కార్పొరేట్ల కొమ్ములు వస్తున్నాయని కార్పొరేట్ లబ్దికోసం ఈరోజు రైతుల పైన అతి కిరాతకంగా దాడులకు దిగుతున్నారని విమర్శించారు ఈ సందర్భంగా స్థానిక నందు రైతు సంఘాలు మరియు ప్రజా సంఘాల సమావేశం కామ్రేడ్ లక్ష్మిరెడ్డి కామ్రేడ్ వెంకటేశులు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని అదేవిధంగా పార్లమెంట్లో ఆమోదం పొందిన నల్ల చట్టాలు 3 రద్దు చేయాలని నూతన విద్యుత్ సంస్కరణల చట్టం రద్దు చేయాలని ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని రైతులకు వ్యవసాయ కార్మికులకు వారు పిలుపునిచ్చారు .

 

 

 

అదేవిధంగా దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వాలు మాత్రం అం యదేచ్ఛగా తమకు పట్టీపట్టనట్లు వివరించడం దేశచరిత్రలో ఇలాంటి ప్రభుత్వాలు ఉండటంవల్ల సిగ్గుచేటని మునుపెన్నడూ జరగని రీతిలో లక్షలాది మంది రైతులు ఆందోళన పోరాటాలలో లెక్కచేయకుండా పాల్గొన్న సందర్భంగా ప్రభుత్వాలు మాత్రం వారు ధ్వజమెత్తారు దాదాపు ఆరు నెలలకు సరిపడా సరుకులు కూడా తమ వెంట తీసుకు వచ్చి మూడు నెలల చట్టాలను రద్దు చేసేంతవరకు కూడా తమ పోరాటాన్ని విరమించి ప్రసక్తే లేదని నిర్భయంగా ప్రకటించడం జరిగిందని అందులో భాగంగానే ఆరవ తేదీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అఖిలభారత కిసాన్ సభ కో ఆర్డినేషన్ కమిటీ పిలుపు ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం రైతుల తో చర్చలు చేయకుండా కాలయాపన చేస్తోందని అదేవిధంగా ఎన్నిసార్లు ఎన్నిసార్లు వాళ్లే వస్తారు.

 

 

 

ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని కాబట్టి రైతులు రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి నల్ల చట్టాలను రద్దు చేసుకుంటామని రైతు సంఘాలు అన్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా 8వ తేదీ భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది .ఆరో తేదీ జరిగే ఈ నిరసన కార్యక్రమంలో అదేవిధంగా 8వ తేదీ జరిగే దేశ వ్యాప్త బందులో రైతులు వ్యవసాయ కార్మికులు గ్రామీణ ప్రజలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని అలాగే వ్యవసాయ అభివృద్ధి చేసేంతవరకు కూడా పోరాటాన్ని కొనసాగించాలని వారు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు గోపాల్ ,రాజు ,శ్రీనివాసులు, నరసప్ప ,అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.

పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Agricultural bills should be abolished

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *