ఇక జిల్లాల్లో వ్యవసాయ డాక్టర్లు

Date;28/02/2020

ఇక జిల్లాల్లో వ్యవసాయ డాక్టర్లు

 

కరీంనగర్ముచ్చట్లు:

పంటలకు తెగుళ్లు సోకిందని, చీడపట్టిందని ఇక నుంచి ఇష్టారాజ్యంగా మందులు కొనుగోలు చేయడం, వాడడం కుదురదు.. పంటల రక్షణకు వ్యవసాయా ధికారులే డాక్టర్లుగా
వ్యవహరింనున్నారు. వ్యవసాయలో పురుగుల మందుల వాడకం ఎక్కువగా చేసే జిల్లాలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఒకటిగా పేరుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం ప్రస్తుతం సూర్యాపేట  జిల్లాలో పురుగుల మందుల డీలర్లు ఏటా రూ. 100 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో రైతులు వానాకాలం, యాసంగి సీజన్‌లో పురుగుల మందులు కొంటున్నప్పటికీ  వాటిలో చాలా వరకు రైతులకు ఉపయోగపడటం లేదు. జిల్లాలో సుమారు 500కు పైనే పురుగుల మందుల దుకాణాలున్నాయి. కొంతకాలం కిందట బీఎస్సీ కెమిస్ట్రీ లేదా అగ్రికల్చర్ బీఎస్సీ, వ్యవసాయ కోర్సుల అర్హతలున్నవారికే డీలర్‌షిప్‌లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇప్పటి వరకు ఎటువంటి అర్హతలు లేకుండా పురుగుల మందుల వ్యాపారాలు  చేస్తున్న వారు గగ్గోలు పెట్టారు.వారు రాసిచ్చే ప్రిస్కిప్షన్ ఆధారంగా మందులు కొనుగోలు చేసి వాడాలి..పెస్టిసైడ్ దుకాణదారులూ ఈ నిబంధనలను కచ్చితంగా పాటించా ల్సిందే.. లేకుంటే కఠిన  చర్యలు తీసుకో నున్నారు. ఇప్పటివరకు అవగాహన లేక ఇష్టారీతిన మందులు వాడడం వల్ల ఒక్కోసారి పంటలు నష్టపోవడమే కాకుండా భూములు విషతుల్యంగా మారుతున్నాయి. రాష్ట్ర  ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల చివరి వారం నుంచి ఈ నిబంధనలు అమలు చేసేలా అధికారులు సన్నద్ధ మవుతున్నారు. మనుషుల కు వచ్చే రోగాలకు మందులను మెడికల్ దుకాణాల్లో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వరు. ఒక వేళ ఎవరైనా ఇచ్చినా అది నిబంధనలను ఉల్లంఘించినట్లే. అలాగే ఇక ముందు పంటలకు వచ్చే చీడ పీడలు, తెగుళ్లకు రాష్ట్ర ప్రభుత్వం
వర్తింపజేయనుంది.చీడపీడలు, తెగుళ్ల మందులను వ్యవసాయశాఖ అధికారులు లిఖిత పూ ర్వకంగా ఇచ్చే ప్రిస్క్రిప్షన్ల ఆధారంగానే పెస్టిసైడ్ షాప్‌ల నిర్వాహకులు ఇవ్వాల్సి ఉంది. ఈ
నిబంధనను అతిక్రమించిన పురుగుల మందుల దుకాణాలపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ప్ర భుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు పెస్టిసైడ్ వ్యాపారులు చెప్పిందే వేదంగా  రైతులు భావిస్తున్నారు. పంటకు వచ్చిన తెగులు లక్షణాలు ఫెస్టిసైడ్ షాప్‌కు వెళ్లి చెప్పడం, సదరు వ్యాపారి తనకు తోచిన పురుగుల మందులను కట్టబెట్టడం జరుగుతున్నది. దీంతో  అనవసర వ్యయంతో పాటు ఒక్కోసారి పురుగు మందులు వికటించి పంటలు నాశనం కావడంతో రైతులు నష్టపోతున్నారు. మరోపక్క విచ్చలవిడిగా ఉపయోగిస్తున్న పురుగుల మందులు  పర్యావరణానికి చేటు చేస్తోంది. చాలామంది రైతులు పురుగుల మందులతోనే ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో విచ్చలవిడి మందుల అమ్మకాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
రైతుల అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకుని పురుగు మందుల వ్యాపారంలో పెరిగిపోయిన విచ్చలవిడితనాన్ని నిరోధించే దిశగా ప్రస్తుతం ప్రిస్క్రిప్షన్ విధా నం అమల్లోకి తీసుకురానుంది. ఈ  విధానం ప్ర కారం రైతులు తమ పంటలకు తెగుళ్లు సోకినా, చీడ పీడలు ఆశించినా ఆ విషయాన్ని వ్యవసాయాధికారులకు తెలపాలి. ఏఓ లేదా ఏఓఈలు క్షేత్రస్థాయిలో పంట పొలాలను  పరిశీలించి తెగుళ్లు, చీడ పీడల నివారణకు ఏయే పురుగుల మందులు వాడాలో పె స్టిసైడ్ షాపులకు సూచిస్తూ ప్రిస్కిప్షన్ రాస్తారు. రైతు లు ఆ ప్రిస్క్రిప్షన్ చీటీని పురుగుల మందుల  దుకాణాల్లో చూపించి వాటిని తీసుకోవాలి. ప్రస్తుతం జరుగుతున్న పంపిణీ, బ్యాంక్‌రుణాల మంజూరు తదితర పనుల్లో బిజీగా ఉన్న వ్యవసాయాధికారులు ఈ పనులు పూర్తవగానే ప్రభుత్వం  కొత్తగా నిర్దేశించిన పురుగుల మందుల చిటీలు రాయడంపై దృష్టిని సారించేందుకు సిద్ధమవుతున్నారు.

Tags;Agricultural doctors in the districts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *