ఉసూరుమంటున్న రైతన్న 

Date:17/07/2019

కరీంనగర్ ముచ్చట్లు:

ఊరిస్తున్న మేఘాలు ఉసూరుమనిపిస్తున్నాయి. ఆరుగాలం శ్రమలో అన్నదాతను ఆగం చేస్తున్నాయి. సాగు సమరంలో ఆదిలోనే ఆటంకాల్ని సృష్టిస్తున్నాయి. ఈ సారీ మళ్లీ గడ్డుకాలమనే పరిస్థితులు కర్షకుల కళ్లకు కనిపిస్తున్నాయి. అదును దాటుతున్నా పంటల జాడలేక అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. అసలే ఆలస్యం.. ఇంకా పంటలు వేయడంలో జాగు జరిగితే దిగుబడులపై ప్రభావం తప్పదనే  ఆందోళన చెందుతున్నారు. ఆదిలోనే ఖరీఫ్‌ సీజన్‌పై కరవు ఛాయలు అలుముకున్న పరిస్థితి నెలకొంది.

 

 

 

 

ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఉమ్మడి జిల్లాలో గతంతో పోలిస్తే అంతంత మాత్రంగానే పంటలు వేస్తున్న తీరు కలవరపరుస్తోంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నిధానంగానే వ్యవసాయం సా..గుతోంది. ఉమ్మడి జిల్లా మొత్తం సాగు అంచనా 10.81లక్షల ఎకరాలు కాగా ఇప్పటికీ కనీసం రెండు లక్షల ఎకారాల మేర కూడా పంటలు వేయని దుస్థితి నెలకొంది. ప్రధానంగా వేసే వరి పంట విషయంలో ఈ సారి  నిరాశతప్పదని  అన్నదాతల నుంచి వినిపిస్తోంది. కరీంనగర్‌, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలో ఎక్కువగా వరిని వేస్తారు. దీంతోపాటు మొక్కజొన్న, పత్తిని సాగు చేస్తారు. ఇక వేసిన పంటలు కూడా ఎక్కువగా బోర్లు ఉన్న చోటనే వేయడం కనిపిస్తోంది.

 

 

 

 

వ్యవసాయ బోర్లలో అరకొర నీళ్లున్నా వాళ్లు ముందు జాగ్రత్తగా దుక్కులు దున్ని సాగుకు సమాయత్తమయ్యారు. ఇక ఇటీవల అడపాదడపా పడిన జల్లుల్ని చూసిన రైతులు పెద్ద వాన పడితే రంగంలోకి దాగాలనే ఉద్దేశంతో పెట్టుబడుల్ని సిద్ధం చేసుకున్నారు. విత్తనాల కొనుగోలు మొదలు ఎరువుల వరకు ముందస్తుగానే సిద్ధం చేసుకున్నా.. వరుణుడి కోసం మేఘాలవైపు చూస్తున్నారు.

 

 

ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎప్పటి వరకు ఏఏ పంటలకు గడువు ఉండనుంది.? ఏ పంటలు వేసుకుంటే రైతుకు మేలు జరుగనుందనే విషయమై నాలుగు జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు గ్రామస్థాయిలో అన్నదాతలకు అవగాహన పెంచాల్సిన అవసరముంది.

 

 

ఆరుగాలం శ్రమలో రైతుకు అనుభవమున్నప్పటికీ అధికారుల సలహాలు, సూచనలు జోడైతే మంచి జరిగే వీలుంది. నీటి వనరుల తీరు.. నీళ్ల ఆదరవు సహా ఇతరత్రా చీడపీడల గురించి ముందస్తు సలహాలు, సూచనలు అందితే సాగు తీరులో ఒడిదొడుకులు లేకుండా ఉంటుంది. పంటమార్పిడి సహా ఇతరత్రా విషయాల్ని వివరిస్తే బాగుంటుంది.

 

 

లేదంటే పెట్టుబడి రూపంలో తీవ్ర నష్టాన్ని చవిచూసే పరిస్థితులు  ఎదురవనున్నాయి. మరోవైపు నాలుగు జిల్లాల పరిధిలోని ప్రధాన జలాశయాల్లోనూ నీటి జాడలు లేవు. దీంతోపాటు ఎక్కువగా చెరువుల కిందనే పంటలు సాగయ్యే వీలుంది. ఈ సారి ఇప్పటి వరకు చెప్పతగిన స్థాయిలో చెరువులు, కుంటల్లోకి నీరు రాలేదు. దీంతో అన్నదాతకు సాగు తీరు విషయంలో అంతర్మథనం తప్పడంలేదు.

అదే కారణం. 

Tags: The farmer who sings

చతికిల పడిన ఖరీఫ్

Date:09/07/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ఖరీఫ్ సాగు కింద గత ఏడాది కన్నా 27 శాతం తక్కువగానే సాగు విస్తీర్ణంలో నాట్లు వేయడమైందని, గత ఏడాది 319.68 లక్షల హెక్టార్లలో నాటు పడ గా, 201920 సంవత్సరానికి సంబంధించి గత వారం వరకు కేవలం 234.33 లక్షల హెక్టార్ల లోనే నాట్లు వేయడమైందని, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత నెలలో రుతుపవనాల వర్షాలు లోపించడమే దీనికి కారణం. ఏదేమైనా జులై, ఆగస్టు నెలల్లో వర్షాలు బాగా కురుస్తాయని, నాట్లు ముమ్మరంగా పుంజుకుంటాయని వాతావరణ శాఖ ఆశాబావం వెలిబుచ్చింది. ఇదిలా ఉండగా 14 ఖరీఫ్ పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధరను బాగా పెంచింది.

 

 

 

 

ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభం కాగానే ఖరీఫ్ సాగు పనులు ప్రారంభమైనప్పటికీ వర్షపాతానికి 33 శాతం లోటు ఏర్పడింది.ఖరీఫ్ ప్రధాన వరిపంటకు కేవలం 52.47 లక్షల హెక్టార్ల లోనే వరినాట్లు పడగా గత ఏడాది 68.60 లక్షల హెక్టార్లలో వరినాట్లు పడ్డాయి. చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఒడిశా, మధ్యప్రదేశ్, కర్ణాటక, అరుణాచల్‌ప్రదేశ్, బీహార్, అసోం, పశ్చిమ బెంగాల్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో తక్కువ విస్తీర్ణంలో నాట్లు పడ్డాయి.

 

 

 

 

పప్పుధాన్యాల్లో ముఖ్యంగా కంది, మినుము, పెసర, చాలా తక్కువ విస్తీర్ణంలో అంటే కేవలం 7.94 లక్షల హెక్టార్లలోనే నాట్లు పడ్డాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ పంటలకు 27.91 లక్షల హెక్టార్లలో నాట్లు వేశారు. కాయధాన్యాలకు సంబ ంధించి గత ఏడాది 50.65 లక్షల హెక్టార్లలో నాట్లు పడ గా ఈ ఏడాది 37.37 లక్షల హెక్టార్లలో నాట్లు వేశారు.పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం ఈ ఏడాది చాలా తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్ర లతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పప్పుధాన్యాల సాగు చాలా తగ్గింది.

 

 

 

 

చమురు గింజల సాగుకు సంబంధించి గత ఏడాది 59.37 లక్షల హెక్టార్లలో సాగు చేయగా ఈ ఏడాది గతవారం వరకు వేరుశెనగ, సొయాబీన్, సన్‌ఫ్లవర్ తదితర చమురు గింజల నాట్లు 34.02 లక్షల హెక్టార్లకే పరిమితం అయ్యాయి.వాణిజ్యపంటల్లో చెరకు సాగు గత ఏడాది 51.41 లక్షల హెక్టార్లలో నాట్లు పడగా, ఈ ఏడాది 50 లక్షల హెక్టార్ల లోనే నాట్లు పడ్డాయి. పత్తి, జనుము పంటలు కూడా దిగజారాయి. గత ఏడాది 54.60 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేపట్టగా, ఈ ఏడాది ఇంతవరకు 45.85 హెక్టార్ల లోనే సాగు చేపట్టారు. జనుము కూడా గత ఏడాది కన్నా తక్కువ విస్తీర్ణంలో సాగు చేపట్టడమైందికేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ గత వారం సాధారణ వర్షపాతమే అని ఐఎండి చెప్పినప్పటికీ దానితో సంబంధం లేదని చెప్పారు.

 

 

 

 

 

జులై 10 నాటికి తూర్పు ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం కాగా, ఈశాన్య మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలులో సాధారణ కన్నా ఎక్కువ వర్షపాతం కురిసింది. మిగతా ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం కురిసింది.

అడ్డూ, అదుపు లేకుండా ఫీజులు

 

Tags: Kharif that fell

ప్రకాశంలో పడకేసీన వ్యవసాయం

Date:01/07/2019

ఒంగోలు ముచ్చట్లు:

 

తొలకరి ప్రారంభమై ఏరువాక వచ్చింది. అయినప్పటికీ ఇంత వరకూ చినుకు జాడేలేదు. వర్షం పడిఉంటే ఈ పాటికే రైతులు బెట్ట దుక్కులను దున్ని సాగుకు సిద్ధం చేసేవారు. వర్షం పడని కారణంగా రైతులు నేటికీ దుక్కుల దున్నకాలు ప్రారంభించలేదు. దుక్కులు దున్నేందుకు అవరసమైన వాన కోసం రైతులు ఆకాశం వైపు ఆశతో ఎదురు చూస్తున్నారు. గత పక్షం రోజులుగా ఆకాశంలో మబ్బులు పడుతున్నాయి. అయితే కొద్దిపాటి జల్లులకే వానకే పరిమితం అవుతుంది. చిరుజల్లుతో ఎలాంటి ప్రయోజనం లేక రోజురోజుకు వానపై రైతులకు ఆశలు సన్నగిల్లుతున్నవి. ఖరీప్‌ సాగుకు ముందస్తుగా తొలకరి వానలతో రైతులతో భూమిని దున్ని సిద్ధం చేస్తారు. అననుకూల వాతావరణం కారణంగా ఎడ్లు, అరకలు, ట్రాక్టర్లు చావిడిలకే పరిమితమయ్యాయి. వాతావరణం ఇంకొద్దిరోజులు ఇలానే కొనసాగితే ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్ధకమే.ఇంకొల్లు పరిసర ప్రాంతాలలో గత ఎనిమిది నెలలుగా వర్షం పడిన జాడ లేదు. గత రబీకి ముందు అక్టోబరులో వర్షం పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కనీసం ఒక మోస్తరు వాన కూడ కురవ లేదు. అప్పుడు ఆకాశం మబ్బులు కమ్మి చిరుజల్లులు పడుతున్నాయి. అవి ఎందుకు సరిపోవడం లేదు. వర్షాభావం కారణంగా పశువులు, జీవాలకు గ్రాసం దొరక్క అల్లాడుతున్నాయి. ఈ ఎడాదైనా సకాలంలో వర్షం పడి వాగులు వంకలు,గట్లు కొంచమైన పచ్చబడితే పశువులకు గ్రాసం దొరుకుతుందని పశుపోషకులు ఆశతో ఎదురు చూస్తున్నారు.

పోలవరానికి భారీగా భూసేకరణ వ్యయం

Tags: Farming in the limelight

ఖరీఫ్ కు కష్టాలేనా

Date:28/06/2019

విజయవాడ ముచ్చట్లు:

తాంగానికి అనేక ఒడిదుడుకులతోనే ఖరీఫ్‌ ప్రారంభమవుతోంది. గత సీజన్‌లో పంట దిగుబడులు తగ్గడం, ఖర్చులు పెరగడం, నీటి సమస్యతో రైతాంగాన్ని వెంటాడుతూనే వున్నాయి. దీంతో ఈ ఖరీఫ్‌ సీజన్‌ను రైతాంగం ఆశాజనకంగా ప్రారంభించలేకపోతున్నారు. భూములు దుక్కులు దున్ని ఖరీఫ్‌ పంటలు వేసేందుకు సిద్ధపడినప్పటికీ వర్షాలు 15 రోజులపాటు ఆలస్యమవ్వడంతో ఈసారి సాగయినా సక్రమంగా సాగుతుందా, పంటలు చేతికివచ్చేనా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత సంవత్సరం ఆడవాళ్ల కూలి రోజుకు రూ.150, ఆటో ఖర్చులతో కలిపి అవుతుండగా మగవాళ్ల కూలి రూ.600 వరకు పలుకుతుంది. దీంతో ఉత్సాహంగా సాగుచేసేందుకు కౌలు రైతులు ముందుకురావడంలేదు. దీనికితోడు ఎరు వుల, పురుగుమందుల ధరలు కూడా పెరుగుతాయనే సమాచారం రైతులను మరింత కుంగదీస్తుంది. ప్రతి సంవత్సరం జూన్‌ మొదటివారంలోనే బోరుల కింద వరినారుమళ్లు పోసేవారు. మూడవ వారం లో పెసర, మినుము, కంది లాంటి అపరాల సాగుపంటలను విత్తుకునేవారు. ఈసంవత్సరం జూన్‌ మూడవ వారం వచ్చినా బోర్ల కింద నారుమడులను పోయడం ఇంకా ప్రారంభించలేదు. కొద్దిమంది రైతులు దుక్కులు దున్ని చదునుచేసి సాళ్లుతోలి పత్తి విత్తనాలు విత్తేందుకు ఆకాశంవైపు చూస్తున్నారు. గత రెండు, మూడు రోజుల నుండి చిరుజల్లులే తప్పా దబాటు వర్షాలు పడకపోవడంతో విత్తనాలు విత్తేందుకు వెనకాడుతున్నారు. కాగా కొంతమంది రైతులు వచ్చేపోయే చినుకుకు మొలవకపోతుందా అనే ఆశతో పొడినేలలోనే పత్తి విత్తనాలు పెట్టి పొడికప్పు కప్పుతున్నారు. కాగా మండలంలోని చాలా గ్రామాలలో భూముల కౌలు రేట్లు భారీగా పడిపోయాయి. ముఖ్యంగా ఊటుకూరు, గాదెవారిగూడెం, ఆర్లపాడు, పెనుగొలను, తునికపాడు, దుందిరాలపాడు, గంపలగూడెం వంటి గ్రామాలలో నీటివసతి ఉండి మిరపతోట వేసే భూములకు గత సంవత్సరం ఎకరాకు రూ.30 వేలనుండి 40 వేల వరకు రేటు పలకగా, ఈసంవత్సరం రూ.25 వేలనుండి రూ.30 వేలవరకు మాత్రమే కౌలు చెల్లించేందుకు కౌలు రైతులు ముందుకువస్తున్నారు.

 

 

 

 

 

 

 

అలానే నీటివసతిలేని పత్తి వేసే భూములకు ఎకరాకు రూ.20 వేల నుండి 25 వేల వరకు రేటు పలకగా ఈసంవత్సరం రూ.15 వేలనుండి రూ.20 వేలవరకు కౌలు రేట్లు పలుకుతున్నాయి. దీనికితోడు మండలంలో ప్రభుత్వం నిషేధించిన గైసెల్‌ రకం బిటి-3 విత్తనాలు గ్రా మాలలో నేరుగా రైతుల వద్దకే వచ్చి విక్రయిస్తున్నట్లు వినికిడి. మామూలు బిటి-2 విత్తనాలు ప్యాకెట్‌ రూ.875 ధర పలుకుతుండగా, ఈవిత్తనాలను రూ.1200ల చొప్పున ఇళ్ల వద్దకే వచ్చి రైతులకు అంద చేస్తున్నట్లు రైతులు తెలుపుతున్నారు. ఈరకం పత్తిలో కలుపుమందు కొడితే పత్తిచెట్లకు ఎటువంటి నష్టం కలగకుండా ఏపుగా పెరుగుతాయని, కలుపు, అంతరకృషి ఖర్చులు లేకుండానే పత్తిసాగుచేసే ఆస్కారం ఉండటంతో రైతులు ఆమేరకు ఖర్చుతగ్గుతుందని బిటి-3 విత్తనాల వైపు మొగ్గుచూపుతున్నారు.మండలంలో పలు విత్తనాలు షాపులలో ముతకల రకాలయిన 1061, 2077 తదితర ముతకరక విత్తనాల కొరత ఏర్పడింది. 5204 సూపర్‌ఫైన్‌ రకం (సాంబమసూరు) మాత్రమే మార్కెట్‌లో దొరుకుతున్నాయి. విధిలేని పరిస్థితుల్లో రైతులు సాంబమసూరు రకాన్నే నారుపోసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈసంవత్సరం మండలంలో మిరపసాగు కొద్దిగా తగ్గి ఆమేరకు పత్తిసాగు పెరుగుతుందని వ్యవసాయా ధికారులు అంటున్నారు. సుమారు 500 ఎకరాల మేర మిరపసాగు విస్తీర్ణం తగ్గి ఆమేర పత్తిసాగు పెరు గుతుందన్నారు.

చిరంజీవి రీ ఎంట్రీ సాధ్యమేనా..?

 

Tags: Do not worry

ఖరీఫ్ పై కోటి ఆశలతో రైతన్న

Date:13/06/2019

నల్లగొండ ముచ్చట్లు:

 

వానాకాలంపై ఎన్నో ఆశలతో రైతులు ఖరీఫ్ పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే బోర్లు, బావుల కింద పంటల సాగు చేసే రైతులు వరినాట్లు వేస్తుండగా, రుతుపవనాల రాకకుముందే ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతుండటంతో పత్తి రైతులు దుక్కులు సిద్ధంచేస్తూ పత్తి విత్తనాలు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మరో మూడు నాలుగు రోజుల్లో తెలంగాణను నైరుతి రుతుపవనాలు తాకుతాయన్న సమాచారం, ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడతాయన్న ఆశలతో రైతులు ఖరీఫ్ పంటల సాగుకు ఉపక్రమించారు. నల్లగొండ జిల్లాలో 3.43 లక్షల హెక్టార్లలో పంటల సాగు అంచనా వేస్తున్న వ్యవసాయ శాఖ అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను రైతులకు అందించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. బ్యాంకర్లు పంట రుణాల పంపిణీకి కసరత్తు ఆరంభించారు. జిల్లాలో 2.30 లక్షల ఎకరాల్లో పత్తి, లక్ష ఎకరాల్లో వరి, 3 వేల ఎకరాల్లో వేరుశనగ పంటలు వేస్తారన్న అంచనాతో వ్యవవసాయ శాఖ విత్తనాల పంపిణీకి చర్యలు తీసుకున్నారు. జిల్లా పత్తి రైతుల కోసం 11.5 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు, 72,500 క్వింటాళ్ల వరి విత్తనాలు, 3 వేల క్వింటాళ్ల వేరుశనగ, మరో 1500 క్వింటాళ్ల ఇతర మెట్ట, ఆరుతడి పంటల విత్తనాలు రైతాంగానికి అందించేందుకు మండలాల వారీగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు జిల్లాలోని 4.50 లక్షల మంది రైతులకు పంట రుణాలు అందించేందుకు వార్షిక పంట రుణ ప్రణాళికలను ఖరారు చేసి బ్యాంకర్లకు రుణ లక్ష్యాలను నిర్దేశించారు.

 

 

 

 

 

 

అటు కేంద్ర నుండి పీఎం కిసాన్ సమ్మాన్ పథకం సహాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు ఎకరాకు పంటకు 5 వేల సహాయాన్ని రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తుండటంతో రైతాంగం ఎన్నో ఆశలతో ఖరీఫ్ పంటల సాగు పనుల్లో నిమగ్నమైంది.జిల్లా పంటల సాగు విస్తీర్ణం అనుసరించి 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరముంటాయన్న అంచనాలతో దఫాలవారీగా ఇండెంట్‌తో ఎరువులను తెప్పిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 10 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు 77 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 31 వేల డీఏపీ, 57వేల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 25 వేల ఎంవోపి, 12,500 ఎస్‌వోపీ ఎరువులు అవరసమని అంచనా వేశారు. ఇందులో ప్రస్తుతం వివిధ రకాల ఎరువులు 10 వేల వరకు సరాఫరాకు అందుబాటులో ఉన్నాయని, డిమాండ్‌ను అనుసరించి ఇండెంట్ మేరకు జిల్లాకు ఎరువుల సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని వ్యవసాయ అధికారులు వెల్లడించారు.

 

 

 

 

 

సూర్యాపేట జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో లక్షా 92,350 హెక్టార్లలో పంటల సాగు జరుగుతుందని అంచనా వేయగా వరి 93 వేల ఎకరాల్లో, పత్తి 49వేల హెకార్ల వరకు సాగవుతుందని అంచనా వేశారు. ఎరువులు లక్షా 33 వేల మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనా వేయగా, వివిధ పంటలకు కలిపి విత్తనాలు 19,500 క్వింటాళ్లు అవసరమని అంచనావేసి రాష్ట్ర విత్తన సంస్థకు ప్రతిపాదనలు అందించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో లక్షా 30 వేల హెక్టార్లలో వివిధ పంటల సాగవుతుందన్న అంచనా వేయగా పత్తి 65 వేల హెక్టార్ల మేరకు ఉంటుందని భావిస్తున్నారు. ఆయా పంటల సాగు అంచనాల మేరకు ఎరువులు, విత్తనాల కోసం వ్యవసాయ శాఖ ఇండెంట్‌లు సమర్పించి రైతులకు సరఫరా చేసేందుకు కసరత్తు సాగిస్తోంది.

కలకలం రేపుతున్న కోడెల ట్యాక్స్ వివాదం

 

Tags: Running on kharif hopes on kharif

తెలుగుముచ్చట్లు రంజాన్‌ శుభాకాంక్షలు

Date:04/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ యాజమాన్యం , సిబ్బంది శుబాకాంక్షలు తెలిపారు. ముస్లింలు సుఖసంతోషాలతో రంజాన్‌ పండుగను కుటుంబ సభ్యులతో కలసి నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

ఇట్లు…

తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ , పుంగనూరు .

9న బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం కార్యవర్గం ఎన్నిక

Tags: Congratulations to Ramzan

రైతులకు నాణ్యమైన ఎరువులు, మందులు విక్రయించాలి

– ఏడి ఓబులేసునాయక్‌

Date:20/02/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ కార్యాలయంలో బుధవారం ఏవో సంధ్య ఆధ్వర్యంలో డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏడి ఓబులేసునాయక్‌ హాజరైయ్యారు. ఈ సందర్భంగా డీలర్లతోఆయన మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు డీలర్లు ఖచ్చితంగా రైతులు కొనుగోలు చేసిన ఎరువులు, మందులు వాటి పేర్లను నమోదు చేసి బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులు విక్రయించాలని , నకిలి మందులు, ఎరువులు విక్రయాలు చేపడితే డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్నదాత సుఖీభవ పథకం క్రింద నమోదైన రైతుల జాబితాను పరిశీలించి, వాటి ఖాతా వివరాలను కార్యాలయానికి అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీఏలు , డీలర్లు రాజారెడ్డి, వెంకటరెడ్డి, కిషోర్‌, పళణి, రవి తదితరులు పాల్గొన్నారు.

 

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలి

Tags: Farmers should sell quality fertilizers and medicines

రైతులు డ్రిప్‌ ఇరిగేషన్‌పై అవగాహన పెంచుకోవాలి

– జిల్లా పీడీ విద్యాశంకర్‌

Date:30/01/2019

పుంగనూరు ముచ్చట్లు:

రైతులు ప్రతి ఒక్కరు డ్రిప్‌ ఇరిగేషన్‌పై పంటలు పండించేందుకు అవగాహన పెంచుకోవాలని జిల్లా ఏపిఎంఐపి ప్రాజెక్టు డైరెక్టర్‌ విద్యాశంకర్‌ కోరారు. బుధవారం మండల కార్యాలయంలో పుంగనూరు, రామసముద్రం మండలాల రైతులకు డ్రిప్‌ ఇరిగేషన్‌, ఉద్యానవన పంటలపైన అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ విద్యాశంకర్‌ మాట్లాడుతూ రైతులు ఉన్న నీటిని వృధా కాకుండ, తొలుత పొలానికి డ్రిప్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేసుకుని, తరువాత పంటలు పండించే విధానానికి చర్యలు తీసుకోవాలన్నారు. దీని ద్వారా రైతులకు నాణ్యమైన ఉత్పత్తితో పాటు అధిక దిగుబడులు సాధించేందుకు వీలుంటుందన్నారు. అలాగే ఉధ్యానవనశాఖ ద్వారా పండ్లతోటల పెంపకాలు చేపట్టాలన్నారు. రైతులు డ్రిప్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేసుకునేందుకు, నేరుగా సంప్రదించేందుకు బయోమెట్రిక్‌ విధానాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యులు తీసుకుంటున్నట్లు ఈ సమావేశంలో డాన్‌ఫౌండేషన్‌ కో-ఆర్డినేటర్‌ తులసిదేవి, జైయిన్‌ కంపెనీ మేనేజర్‌ రవికాంత్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరును అన్ని విధాల అభివృద్ధి చేస్తాం

 

Tags: Farmers should develop awareness on drip irrigation