సుప్రీం కోర్టుకు వ్యవసాయ చట్టాలు

Date:13/10/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై  సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు చట్టాలపై ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. వ్యవసాయ సంస్కరణ చట్టాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని, వాటిని అమలు కాకుండా చూడాలని సుప్రీం కోర్టు న్యాయవాది మనోహర్‌శర్మ, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, ఛత్తీస్‌గఢ్‌ కిసాన్‌ కాంగ్రెస్‌ నేతలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా.. న్యాయవాది శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. పిటిషన్‌లో సరైన కారణాలు చూపనందున విచారణకు స్వీకరించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని న్యాయవాదికి సూచించింది.ఈ మేరకు ఇరువర్గాల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. కాగా, కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో నిత్యావసర సరుకుల సవరణ బిల్లు-2020, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్, ఫెసిలియేషన్ బిల్లు- 2020, ఫార్మర్స్ ఎంపవర్ మెంట్ అండ్ ప్రొటక్షన్, అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ బిల్లు-2020) బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించింది. అనంతరం బిల్లులకు రాష్ట్రపతి సైతం ఆమోదముద్ర వేశారు. బిల్లులు పార్లమెంట్‌లో ఆమోదించిన నాటి నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలతో పాటు రైతు సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులు రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మళ్లీ కరోనా కేసులు

Tags:Agricultural laws to the Supreme Court

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *