కార్పోరేట్ సంస్థలకు కొమ్ముకాసే విధంగా వ్యవసాయ బిల్లు

Date:25/09/2020

ఉత్పత్తులకు మద్దతుధరకు కరువైన రక్షణ

వ్యవసాయ బిల్లుపై “టీఆర్ఎస్ ట్రాన్స్ జెండర్” అవతారం

తెలంగాణాలో నియంత్రిత నిర్బంధసాగు

రైతాంగానికి అండగా కాంగ్రెస్

జగిత్యాల ముచ్చట్లు:

కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లు కార్పోరేట్ సంస్థలకు కొమ్ముకాసే విధంగా ఉందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటినుంచి కాంగ్రెస్ నాయకులు  ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహశీల్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టి అనంతరం ఆర్డిఓ మాధురి కి వినతిపత్రం సమర్పించారు.

 

ఈసందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఫ్రీ ట్రేడింగ్ నెపంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లు రైతాంగానికి ఇబ్బందులు కలిగించే విధంగా ఉందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే విధంగా చేసిన బిల్లుతో చిన్న, సన్నకారు రైతులకు చాల ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఐదు ఎకరాల భూమి కలిగిన రైతులు వరి, మొక్కజొన్న  తదితర  పంటలు వేస్తారని అయితే దిగుబడి 50క్విటాళ్ల వస్తే వాటిని స్థానికంగానే అమ్ముకుంటారని కానీ  ఇతర రాష్ట్రాలకు వెళ్లి అమ్ముకోవడం సాధ్యమయ్యే పని కాదన్నారు. ఈ పరిస్థితుల్లో  రైతాంగానికి
వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతుధర పొందడంలో ఏవిధమైన రక్షణలేదని ఆరోపించారు.రైతు వ్యతిరేక చట్టం అమలును నిలిపివేయడం తో పాటు మరోవైపు స్థానికంగా ఉత్పత్తులకు మద్దతుధర పొందడంలో విఘాతం కలుగుతుందని, అంతేగాకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులను విదేశాల నుంచి దిగుమతి విధానం రైతాంగాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తోందని  జీవన్ రెడ్డి విమర్శించారు.స్థానిక ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పొందుటకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని, స్థానికంగా కొరత ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రమే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విధంగా కేంద్రం ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని  జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

వర్తక, వ్యాపారులకు లాభం చేకూరే విధంగా చట్టాలు చేయడం బాధాకరమన్నారు.
మొక్కజొన్న పంటకు క్వింటాళుకు ప్రభుత్వం రూ.1800 మద్దతు ధర ప్రకటించగా వ్యాపార వర్గాలు రూ.1200 లకే కొనుగోలు చేస్తుండడంతో రైతుకు క్వింటాళుకు సుమారు ఆరు వందల నష్టం వాటిల్లిందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.దిగుమతి సుంకాన్ని 50శాతం నుంచి 15శాతానికి తగ్గించడం దారుణమని పేర్కొంటూ యదావిధిగా 50శాతం విధించాలన్నారు.
తెలంగాణా ప్రభుత్వం నియంత్రిత సాగుపేరుతో నిర్బంద సాగును అమలు చేస్తుందని , సన్నరకం వరి తో దిగుబడి తగ్గడమే కాకుండా చీడ,పీడల బెడద ఎక్కువగా ఉండడం, నెల రోజులు గడువు దొడ్డు రకం వరికంటే ఎక్కువ పడుతుందని రూ.2500 మద్దతు ధర ప్రకటిస్తేనే రైతుకు గిట్టుబాటవుతుందని తెలిపారు. రైతు బంధు పేరుతౌ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు రాయితీలను తొలగించిందని ఇది సబబు కాదన్నారు. వ్యవసాయ బిల్లు విషయంలో టిఆర్ఎస్ పార్టీ వింత పోకడ అవలంబించిందని విమర్శించారు. వర్షాకాలం పార్లమెంటు సమావేశాల్లో  వ్యవసాయ బిల్లును వ్యతిరేకించకుండా, వాకౌట్ చేయకుండా కేవలం సభనుంచి సభ్యులు నిష్క్రమించి ట్రాన్స్ జెండర్ గా మారారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు.

 

రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని , కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ ఉత్పత్తుల ఫ్రీ ట్రేడింగ్ విధానానికి సవరణలు చేపట్టాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.   వర్షం కురుస్తున్న నాయకులు తడిస్తూ  జీవన్ రెడ్డి ప్రసంగాన్ని విన్నారు. వింటూ  ఈకార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టిపిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి బండ శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, తాటి పర్తి విజయలక్ష్మి, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కల్లెపల్లి దుర్గయ్య, కౌన్సిలర్లు నక్క జీవన్, ఆసియా సుల్తానా, గొల్లపల్లి సర్పంచ్ ముస్కు నిషాంత్ రెడ్డి, నాయకులు గాజుల రాజేందర్, పులి రాము, బింగి రవి, గంగం మహేష్, కస్తూరి శ్రీనివాస్,కమాలొద్దిన్, నరేష్ గౌడ్, రాధాకిషన్, రవీందర్ రావు , వెంకటేష్,నేహాల్ , పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

 

బాల్య వివాహాలను అరికట్టాలి

Tags:Agriculture bill as a horn for corporate entities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *