అగ్రిగోల్డ్ బకాయిలను చెల్లించాలి
విశాఖపట్నం ముచ్చట్లు:
అగ్రిగోల్డ్ యాజమాన్యం నుంచి తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అగ్రిగోల్డ్ బాధితులు విశాఖలో ఆందోళన చేపట్టారు. అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసిన ప్రభుత్వం… వాటిని అమ్మకానికి పెట్టి వచ్చే నిధులతో తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. 20వేల లోపు బాండ్లు ఉన్న బాధితులకు నగదు చెల్లిస్తామని చెబుతున్నప్పటికీ అది కార్యరూపం దాల్చడం లేదని, ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. వీలైనంత త్వరగా అగ్రిగోల్డ్ యాజమాన్యం నుంచి తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోతే చంద్రబాబు నాయుడుకు పట్టిన గతే వైకాపాకు పడుతుందని హెచ్చరించారు.
Tags: Agrigold must pay dues

