ఆహా..! పుంగనూరులో భోజనం ఎంతో రుచి

పుంగనూరు ముచ్చట్లు:

ఆహా…మధ్యాహ్న భోజనం ఎంతో రుచిగా ఉంది…. మెను ప్రకారం భోజన పథకం అమలు చేయడం సంతోషం అంటు నూతన ఎంపీడీవోగా వచ్చిన గ్రూపు-1 అధికారి రామనాథరెడ్డి భోజన పథకం అమలుపై ప్రశంసలు కురిపించారు. శుక్రవారం మండలంలోని గూడూరుపల్లె హైస్కూల్‌ను ఆయన సందర్శించారు. పిల్లలతో కలసి భోజనం చేశారు. పిల్లలతో ముఖాముఖి నిర్వహించారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో భోజన పథకం పటిష్టంగా అమలు చేయడం విద్యార్థుల అదృష్టమన్నారు. పాఠశాల ఉపాధ్యాయులను, వంట కార్మికులను అభినందించారు. ఈయన వెంట ఎంఈవో వెంకట్రమణారెడ్డి, హెచ్‌ఎం మహేష్‌నారాయణ, ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్‌ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Aha..! Food in Punganur is very tasty

Leave A Reply

Your email address will not be published.