Ahmedabad Kovid Hospital fire kills 8 patients

అహ్మదాబాద్ కోవిడ్ ఆసుపత్రిలో మంటలు.. 8 మంది రోగులు మృతి..

Date:6/08/2020

అహ్మదాబాద్ ముచ్చట్లు:

గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీనితో 8 మంది రోగులు ప్రాణాలు కోల్పోగా.. మరో 35 మంది రోగులు గాయాలపాలయ్యారు. అహ్మదాబాద్లోని నవరంగపురలో ఉన్న శ్రేయ్ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో నాలుగవ అంతస్థు నుంచి గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అవి ఇతర బ్లాకులకు కూడా వ్యాపించడంతో ఎనిమిది మంది రోగులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గాయాలపాలైన మరో 414 మంది బాధితులను వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. ఇక అహ్మదాబాద్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో శ్రేయ్ ఆసుపత్రిని కరోనా బాధితులకు చికిత్సను అందించడం కోసం కోవిడ్ ఆసుపత్రిగా మార్చారు. కాగా, అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణం తెలియాల్సి ఉంది.ఆసుపత్రి మేనేజన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్డు సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రుపానీ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయలు, క్షతగాత్రులకు యాభై వేల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసారు. 4అహ్మదాబాద్ కోవిడ్ ఆసుపత్రిలో మంటలు.. 8 మంది రోగులు మృతి..

 

గుండెపోటుతో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి

Tags:Ahmedabad Kovid Hospital fire kills 8 patients

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *