ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వ్యాఖ్యాలను ఖండించిన ఐకాస

నర్సాపురం ముచ్చట్లు:
 
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం జిల్లా కేంద్రంగా ఉండాలన్నా లక్ష్యంతో నరసాపురం నియోజక వర్గ ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నర్సాపురం ప్రజలు ఉద్యమాలు కామెడీగా ఉన్నాయి అని కామెంట్ చేయడాన్ని ఖండిస్తూ నరసాపురం అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ నెక్కంటి సుబ్బారావు. కో కన్వీనర్ పొత్తూరు రామరాజు. ప్రెస్ ఇంచార్జ్ కోటిపల్లి సురేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నిన్న మాట్లాడిన నర్సాపురం ప్రజలు చేస్తున్న ఉద్యమాలు కామెడీగా ఉన్నాయని అని మాట్లాడడం సమంజసం కాదని ఆయన పొలిటికల్ ఇమేజ్ కోసం నర్సాపురం ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని. కాబట్టి ఆయన కామెడీ విషయాలు మాట్లాడటం సరికాదని. నర్సాపురం ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని. ఆయన నరసాపురం ప్రజలకు క్షమాపణ చెప్పాలని అఖిలపక్ష జేఏసీ హెచ్చరిస్తున్నా మని అన్నారు.ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ ఇలపకుర్తి ప్రకాష్. కోటిపల్లి వెంకటేశ్వరరావు. తదితర నాయకులు పాల్గొన్నారు.
గుండెపోటుతో నిరుద్యోగి మృతి
Tags; Aikasa condemned the remarks of MLA Granthi Srinivas