సొంత పార్టీ నేతలపైనే గురి

Date:18/02/2020

విజయవాడ ముచ్చట్లు:

ముల్లును ముల్లుతోనే తీయాల‌నేది సామెత‌. అది ఏ రంగానికైనా వ‌ర్తింప‌జేయొచ్చని నిరూపిస్తున్నారు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని. టీడీపీలోనే ఆయ‌న సొంత పార్టీనేత‌ల‌పైనే అసంతృప్తి గ‌ళాన్ని వినిపిస్తున్నారు. ముఖ్యంగా గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఓడిపోయిన మైల‌వ‌రం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దేవినేని ఉమాపై కేశినేని నానికి పీక‌ల‌దాకా కోపం ఉన్న మాట వాస్తవం. ఆయ‌న గ‌తంలో మంత్రిగా ఉన్న స‌మ‌యంలో జిల్లా పై పూర్తి అధికారం చ‌లాయించారు. ఎవ‌రినీ ఎద‌గ‌నివ్వలేదనేది టీడీపీ నేత‌లే చెబుతున్న మాట‌లు. చంద్రబాబు కూడా దేవినేనికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

 

 

 

ఆయ‌న ఓడిపోయిన త‌ర్వాత కూడా ఆయ‌నే ప్రాధాన్యం ఇవ్వడం కేశినేని వంటి వారికి ఇబ్బంది క‌లిగించింది. దీంతో కేశినేని నాని వ్యూహాత్మకంగా దేవినేనిని టార్గెట్ చేస్తున్నారు. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత నేరుగా దేవినేని పై ట్విట్టర్‌లో కామెంట్లు పెట్టారు. త‌న సొంత సామాజిక వ‌ర్గమే అయినా దేవినేనిని టార్గెట్ చేయ‌డంపై పార్టీలో చ‌ర్చ జ‌రిగింది. అయినా కేశినేని నాని వెన‌క్కి త‌గ్గలేదు.ఇక‌, ఇప్పుడు మ‌రింత‌గా త‌న వ్యూహానికి ప‌దును పెట్టార‌ట కేశినేని. మైల‌వ‌రంలో దేవినేని వ్యతిరేక వ‌ర్గాన్ని ఆయ‌న చేరదీస్తున్నార‌ని స‌మాచారం.

 

 

 

దీనిలో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఉన్నార‌నే ప్రచారం జరుగుతోంది. వ‌సంత‌కు అనుకూలంగా కేశినేని నాని వ్యవ‌హ‌రిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇద్దరు నాయ‌కుల మ‌ధ్య ఫోన్ సంభాష‌ణ‌లు కూడా జ‌రుగుతున్నాయ‌ట‌. నియోజకవర్గానికి ఎంపీ ఫండ్స్ కూడా బాగానే ఇస్తున్నట్లు చెబుతున్నారు. దేవినేనికి ఇక‌పై భ‌విష్యత్తులో కూడా మైల‌వ‌రంలో చోటు ద‌క్కకుండా ఆయ‌న గెలిచే అవ‌కాశం లేకుండా చేయ‌డంలో భాగంగా దేవినేని వ్యతిరేకంగా ఉన్న వ‌ర్గాన్ని మొత్తాన్ని త‌న క‌నుస‌న్నల్లో న‌డిపించాల‌ని కేశినేని నాని భావిస్తున్నార‌ట‌.

మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యం మిర్చి రైతులకు శాపం

Tags: Aim at the own party leaders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *