అసమ్మతి నేతలపై గురి…

హైదరాబాద్ ముచ్చట్లు:


టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రూపు రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. అన్ని స్థాయిల్లోని నేతలను ఏకం చేసే ప్రయత్నాలను షురూ చేశారు. మొన్న ఖమ్మం జిల్లాలో సొంత పార్టీలోని వేర్వేరు గ్రూపులను ఒక్కటి చేశారు. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీనియర్ నేత జూపల్లి కృష్ణారావును బుజ్జగించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో పుంజుకుంటున్నాయనే అభిప్రాయం నెలకొన్న సమయంలో.. టీఆర్ఎస్‌ను పటిష్టంగా ఉంచడంపై దృష్టి సారించారు. ప్రత్యర్థి పార్టీలకు నియోజకవర్గాల్లో గ్రౌండ్ లేకుండా చేయాలని భావిస్తున్నారు. చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ నేతలు వేర్వేరు గ్రూపులుగా చీలిపోయి ఉండటంతో.. రానున్న ఎన్నికల్లో చేటు చేస్తుందనే భావనతో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు.రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొన్న సమయంలో మూడోసారి అధికారంలోకి రావడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నది. ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీలు బలం పుంజుకుంటూ ఉండడం ఒకవైపు సొంత పార్టీలోనే అసమ్మతి, మరోవైపు గ్రూపులు ఏర్పడడం గులాబీ పార్టీకి ఆందోళన కలిగిస్తున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేటీఆర్ గతంలో కొద్దిమంది అసమ్మతివాదులతో చర్చించి వారిని బుజ్జగించారు. ఇంకోవైపు ఐ-ప్యాక్ ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముమ్మరంగా సర్వే జరుగుతూ ఉన్నది. ఇప్పటివరకు పార్టీకి అందిన నివేదికను పరిగణనలోకి తీసుకుని ఎక్కడెక్కడ పార్టీ బలహీనంగా ఉన్నదో, ప్రత్యర్థి పార్టీలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయో గ్రహించి వాటికి తగిన పరిష్కారం కనుగొనడంపై ఫోకస్ పెట్టారు.అందులో భాగంగా ఖమ్మం జిల్లాలోని మూడు గ్రూపుల నేతలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చారు. గత ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం పది అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ ఒక్కచోట మాత్రమే గెలుపొందింది. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు.

 

 

 

అలాంటి చోట్ల గతంలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన నేతలకు, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేల మధ్య వైరం నెలకొన్నది. ఒకవైపు వీరి మధ్య అగాధాన్ని పూడుస్తూనే మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు వస్తాయనే భ్రమలు వద్దని, గెలుపు గుర్రాలకు మాత్రమే అవకాశం ఉంటుందనే స్పష్టమైన మెసేజ్‌ను కూడా పంపారు. దీంతో అక్కడ పార్టీ పరిస్థితి ఒక మేరకు గాడిన పడిందనే అభిప్రాయం ఏర్పడింది.ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ అదే తరహా పరిస్థితి నెలకొనడంతో కేటీఆర్ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత జూపల్లి కృష్ణారావుతో చర్చలు జరిపారు. పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న ఆయన మరో పార్టీలో చేరుతారనే వార్తలు నియోజకవర్గం నుంచి వినిపిస్తున్నాయి. దీంతో ఆయనను నిలుపుకోడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో ఇలాంటి కొన్ని సమస్యలు ఉండడంతో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా స్పెషల్ టాస్క్ చేపట్టారు. రానున్న కాలంలో అలాంటి నియోజకవర్గాల్లో మరింత ముమ్మరంగా పర్యటనలు చేసే అవకాశం ఉన్నది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని స్వయంగా ఆయనే పిలుపు ఇస్తున్న నేపథ్యంలో పార్టీ నేతల్లోనూ అసంతృప్తి, రెబల్ బెడద లేకుండా చూసుకుంటున్నారు.

 

 

 

Post Midle

పార్టీలో ట్రబుల్ షూటర్‌గా హరీశ్‌రావుకు గుర్తింపు ఉన్నప్పటికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ రానున్న ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తన వంతు బాధ్యతపై దృష్టి పెట్టారు. గతంలో జిల్లాలవారీగా నేతలను పిలిపించుకుని చర్చలు జరిపిన కేటీఆర్.. చాలా చోట్ల నేతలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ సూచనలు, ఐ-ప్యాక్ సర్వే నివేదికలను దృష్టిలో పెట్టుకుని తాజా పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టడం గమనార్హం. ఎక్కడెక్కడ ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి? ప్రజల్లో ఎక్కువగా తిరుగుతున్నదెవరు? పార్టీ కార్యకలాపాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నదెవరు? ప్రజల్లో ఏ నేత పట్ల ఎక్కువ ఆదరణ ఉన్నదిఝఇలాంటి అంశాలన్నింటినీ గమనంలోకి తీసుకున్న కేటీఆర్.. వీలైనన్ని ఎక్కువ సీట్లను గెలిపించుకోవడంపై ఫోకస్ పెట్టారు.గతంకంటే ఈసారి ఎక్కువ స్థానాల్లోనే గెలుస్తున్నామని, కనీసంగా 95-105 మధ్య సీట్లు రావడం ఖాయమంటూ పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో స్పష్టం చేశారు. అయితే ప్రత్యర్థి పార్టీలు సృష్టిస్తున్న వివాదాలు, సెంటిమెంట్ అంశాలను తెరపైకి తెచ్చి ప్రజలను ప్రభావితం చేయడం, వివిధ సెక్షన్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తి.. ఇవన్నీ టీఆర్ఎస్‌ను ఆలోచనల్లోకి నెట్టాయి. దీంతో జిల్లాల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో ప్రజల్లో నమ్మకాన్ని సృష్టించడంతో పాటు పార్టీ నేతల సేవలను సైతం సమర్ధవంతంగా వినియోగించుకోవాలనుకుంటున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూనే ప్రత్యర్థి పార్టీల బలాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి.

 

Tags:Aiming at dissident leaders …

Post Midle
Natyam ad