భారీగా పెరుగుతున్న ఎయిర్ చార్జీలు

ముంబై ముచ్చట్లు:


ప్రస్తుత రోజుల్లో అన్నింటి ధరలు మండిపోతున్నాయి. నిత్యవసర సరుకుల నుంచి ప్రయాణ సర్వీసుల వరకు ధరలు మండిపోతున్నాయి. ఇక తాజాగా విమాన ప్రయాణం మరింత ప్రియం కానుంది. దీపావళి సీజన్‌లో విమాన ప్రయాణ ఛార్జీలు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే విమాన టికెట్‌ ఛార్జీలపై 20 నుంచి 30 శాతం వరకు అదనంగా చెల్లించాల్సి రావచ్చు. ఎందుకంటే దీపావళి పండగ సీజన్‌లో ప్రయాణానికి ముందు టికెట్‌ బుకింగ్‌లు పెరిగిపోవడంతో పాటు గత ఏడాదితో పోలిస్తే విమాన ఇంధనన ధరలు భారీగా పెరగడం ఛార్జీల పెంపునకు ప్రధాన కారణమని విమానయాన సంస్థలు పేర్కొంటున్నాయి.గత సంవత్సరం సెప్టెంబర్‌తో పోలిస్తే ఈనెలలో ఏటీఎఫ్‌ కోసం ఎయిర్‌లైన్స్‌ 83 శాతం అధికంగా చెల్లించాల్సి వస్తోంది. దసరా, దీపావళి పండగ సీజన్‌లో విహారయాత్ర కోసం అందుబాటులో ఉన్న విమానాల కోసం సెర్చ్‌లు 25 నుంచి 30 శాతం మేర పెరిగాయని కంపెనీలు చెబుతున్నాయి.ఈ ఏడాది కరోనా లేనందున ఎలాంటి ఆంక్షలు లేవు. దీంతో ప్రయాణాలు మరింతగా పెరిగాయని విమానయాన సంస్థలు చెబుతున్నాయి. నివేదికల ప్రకారం.. ఢిల్లీ-ముంబై, బెంగళూరు-ఢిల్లీ, హైదరాబాద్‌-ఢిల్లీ వంటి ప్రధాన నగరాల మధ్య విమాన ఛార్జీలు 20 నుంచి 33 శాతం మేర పెరిగాయి. ఢిల్లీ-హైదరాబాద్‌ మార్గంలో విమాన ఛార్జీ గత ఏడాదితో పోలిస్తే 3 శాతం పెరిగింది. ఢిల్లీ-బెంగళూరు, కోల్‌కతా-ముంబై, కోల్‌కతా-ఢిల్లీ వంటి మార్గాలలో విమాన టికెట్‌ ధరలు వార్షిక ప్రాతిపదికన 2-7 శాతం పెరిగాయి. కాగా, హైదరాబాద్‌-ఢిల్లీ, ముంబై-ఢిల్లీ, ఢిల్లీ-బెంగళూరు మార్గాల్లో ఛార్జీ 20 నుంచి 33 శాతం వరకు పెరిగాయి.

 

Tags: Air fares are skyrocketing

Leave A Reply

Your email address will not be published.