Natyam ad

వాయు కాలుష్కానికి అడ్డుకట్ట వేయాలి

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖ మరో ఢిల్లీగా మారక ముందే వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేయా లని విశాఖలో జన జాగరణ సమితి డిమాండ్ చేస్తుంది.ఈ క్రమంలో నగరం లో మాస్కులు ధరించి జివిఎంసీ గాంధీ విగ్రహం వద్ద విద్యార్థులతో కలసి నిరసన వ్యక్తం చేశారు. జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లా డుతూ గత నెల నవంబర్ 26వ తేదీన విశాఖలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 274 మార్కు దాటడం అంటే తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుం దని హెచ్చరిక వెలువడానికి ప్రధాన కారణం పెట్రో కెమికల్, బొగ్గు, ఫార్మా కంపెనీలలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు పర్యవేక్షణ లేకపోవడం అని అన్నారు. పరిశ్రమలు వ్యర్ధాలను శుద్ధి చేయకుండా గాలిలోకి వదిలే యడం వల్ల విషపూరిత రసాయనాలు గాలిలో కలిసిపోయి కాలుష్యంగా మారుతుందని తెలిపారు. అధికారులు స్పందించి కాలుష్యం పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 

Tags: Air pollution should be curbed