ఒడిశాలో ఎయిర్ పోర్టు జాతికి అంకితం

Airport is dedicated to the nation in Odisha

Airport is dedicated to the nation in Odisha

 Date:22/09/2018
భువనేశ్వర్ ముచ్చట్లు:
ప్రధాని మోడీ ఒడిశాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు  . తాల్చర్ నగరం ఎయిర్ పోర్టులో ప్రధానికి ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్  సాదర స్వాగతం పలికారు. కోల్ సిటీగా పేరున్న తాల్చర్ లో.. ఫర్టిలైజర్ ప్లాట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఆయన ఒడిశాలో పర్యటిస్తున్నారు.ఎయిర్ పోర్టులో దిగిన ప్రధానమంత్రి.. ముందుగా స్థానిక అంగన్ వాడీ వర్కర్లను కలిశారు.
అంగన్ వాడీ వర్కర్ల వేతనాలను పెంచినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత… తాల్చర్ నగరంలో ఫర్టిలైజర్ ప్లాంట్ ను ప్రారంభించారు. బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని.. ఏడాదిన్నరలో ఎరువుల కర్మాగారం పూర్తవుతుందని చెప్పారు. తాను ఒడిశాకు గతంలో వచ్చినప్పుడు పరిశుభ్రతపై దృష్టిపెట్టాలని సీఎం నవీన్ పట్నాయక్ ను కోరానని.. ఇప్పుడు కూడా స్వచ్ఛతను పెంచాలని విజ్ఞప్తి చేశానని చెప్పారు.
దశాబ్దాలుగా ఓట్లకు భయపడి ఏ ప్రభుత్వమూ తీసుకోని నిర్ణయం తాము తీసుకున్నామని ప్రధాని అన్నారు. ట్రిపుల్ తలాఖ్ తో బాధపడుతున్న ముస్లిం మహిళల హక్కులను కాపాడేందుకు ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపామన్నారు.ఒడిశాలోని జార్సుగడలో కొత్తగా నిర్మించిన ఎయిర్ పోర్టును ..గర్జన్ బహల్  బొగ్గు గనులతో పాటు జార్సుగుడ-బారపలి-సర్దేగా రైల్ లింక్ ను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని.
Tags:Airport is dedicated to the nation in Odisha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *