Aisha who embraced the poor

పేదలను ఆదుకున్న ఆయిషా

Date:05/05/2020

ములకలచెరువు ముచ్చట్లు:

లాక్ డౌన్ కారణంగా నిరుపేదలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. భాగంగా మంగళవారం చెరువులో వైఎస్ఆర్ సీపి ఎంపీటీసీ సభ్యురాలు అయిషా చాంద్ బాషా మానవత్వం చాటుకున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు, కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేదలను గుర్తించారు. సుమారు 12 వందల మంది నిరుపేదలకు పలు రకాల కూరగాయలను పంపిణీకి సిద్ధం చేశారు. తాహసిల్దార్ మహేశ్వరి బాయి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మాధవరెడ్డి, జిల్లా పరిషత్ సభ్యుడు మోహన్ రెడ్డిల చేతుల మీదుగా పేదలకు కూరగాయలను పంపిణీ చేయించారు. సందర్భంగా స్థానికులు అయిషా చాంద్ బాషా ను అభినందించారు. పేదలను ఆదుకునేందుకు మానవత్వంతో దాతలు ముందుకు రావాలని తాసిల్దార్ మహేశ్వరి బాయి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బ్రహ్మానంద రెడ్డి, వైయస్సార్ సిపి నాయకులు సుందర్ రాజు, సదా, రెడ్డప్ప, విశ్వనాథ్, బావాజాన్ తదితరులు పాల్గొన్నారు.

మిద్దె కూలి దంపతులకు తీవ్ర గాయాలు

Tags: Aisha who embraced the poor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *