తిరుపతిలో 7న ఏఐటియుసి సమావేశం జయప్రదం చేయాలి

AITUC meeting should be done on Tirupati 7

AITUC meeting should be done on Tirupati 7

Date:05/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

తిరుపతిలో ఈనెల 7, 8 తేదీలలో ఏఐటియుసి 14వ మహాసభలు విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు రామచంద్రయ్య, సీపీఐ కార్యవర్గ సభ్యుడు జనార్ధన్‌, పెద్దిరెడ్డి కవిత డిమాండు చేశారు. శుక్రవారం ఈ మేరకు కరపత్రాలు, పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా జనార్ధన్‌ మాట్లాడుతూ తిరుపతిలోని బైరాగిపట్టెడ పార్కు వద్ద 7న సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభ జరుగుతుందన్నారు. అలాగే ప్రతినిధుల సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. కార్మికుల హక్కుల కొరకు, జీవన ప్రమాణాలు మెరుగుదల కోసం అలుపెరుగని పోరాటలు చేస్తామన్నారు. ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాచే విధానాలను ఎదుర్కొంటామన్నారు. రెండు రోజుల పాటు తిరుపతిలో జరిగే సమావేశాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి స్థానిక మున్సిపల్‌ కార్మిక సంఘ కార్యదర్శి శ్రీరాములు, పివి.రెడ్డి, సిపిఐ కార్యదర్శి శ్రీరాములు, మున్సిపల్‌ కార్మికుడు రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.

కారెం శివాజీకీ కోర్టులో ఎదురుదెబ్బ

Tags: AITUC meeting should be done on Tirupati 7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed