పవర్ ఫుల్ బ్యూరో క్రాట్ గా అజిత్ ధోవల్

Date:09/10/2018
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారాల్లో కొద్దిపాటి పరిజ్ఞానం ఉన్నవారికైనా అజిత్ ధోవల్ పేరు బాగా తెలుసు. ఇండియన్ జేమ్స్‌బాండ్‌గా పిలుచుకునే ఆయన.. జాతీయ భద్రతా సలహాదారుగా కీలకమైన పదవిలో ఉన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించింది. ఇప్పటి వరకూ ఈ బాధ్యతలను కేబినెట్ సెక్రటరీ పర్యవేక్షిస్తుండగా.. ధోవల్‌కు బదలాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 1998 నుంచి దేశంలోకెల్లా శక్తివంతమైన బ్యూరోక్రాట్‌గా ధోవల్ నిలవనున్నారు.
ఐబీ, రా తదితర విభాగాల మధ్య మరింత సమన్వయం పెంపొందించడానికే ధోవల్‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. 1999లో కేబినెట్ సెక్రటరీ చైర్‌పర్సన్‌గా ఎస్‌పీజీని ఏర్పాటు చేశారు.  ఎన్ఎస్ఏను చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 1999 నోటిఫికేషన్ ప్రకారం ఎస్‌పీజీలో 16 మంది సభ్యులుండగా.. నీతి ఆయోగ్ వైస్‌ చైర్మన్‌‌కి కూడా స్థానం కల్పించి 18కి పెంచారు. శాఖల మధ్య సమన్వయం, సమాచారం అందుకోవడం, జాతీయ భద్రతకు సంబంధించిన విధానాల రూపకల్పన తదితర వ్యవహారాలను స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్ (ఎస్‌పీజీ)ను పర్యవేక్షిస్తుంది.
నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఇది సహ త్రివిధ దళాల అధిపతులు, ఆర్‌బీఐ గవర్నర్; విదేశీ వ్యవహారాలు, హోం, రక్షణ, ఆర్థిక, రెవెన్యూ, అటామిక్ ఎనర్జీ, స్పేస్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్‌ల కార్యదర్శులు, రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు, కేబినెట్ సెక్రటేరియట్‌లోని సెక్రటరీ, ఐబీ చీఫ్ తదితరులు ఎస్‌పీజీలో సభ్యులుగా ఉంటారు. ఎస్‌పీజీలో తాజా మార్పులతో దేశ భద్రత వ్యూహాల రూపకల్పనలో ధోవల్‌ ప్రాధాన్యం మరింత పెరిగినట్లయ్యింది. ధోవల్ ఎస్‌పీజీ సమావేశాలను నిర్వహిస్తే.. వివిధ శాఖలు, విభాగాల్లో నిర్ణయాలు ఎలా అమలు అవుతున్నాయో కేబినెట్ సెక్రటరీ పర్యవేక్షిస్తారు.
Tags:Ajit Doval as Powerful Bureau Crot

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed