పంజాబ్ లో ఆకాళీదల్, బీఎస్పీ పొత్తు

ఛండీఘడ్ ముచ్చట్లు :

 

పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికల జరగబోయే రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్‌డీఏ నుంచి బయటకొచ్చిన శిరోమణి అకాలీదళ్.. మాయావతి పార్టీతో పొత్తుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా.. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో కలిసి శిరోమణి అకాలీదళ్ కూటమి ఏర్పాటుచేయనుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
కూటమి ఏర్పాటుకు సంబంధించి పూర్తి వివరాలపై శనివారం ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపాయి. గతేడాది సెప్టెంబరులో బీజేపీకి చెలిమికి వీడ్కోలు పలికిన ఎస్‌ఏడీ.. ఆ లోటును బీఎస్పీతో భర్తీ చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. పంజాబ్‌లో 27 ఏళ్ల తర్వాత ఈ రెండు పార్టీలూ జతకట్టబోతున్నాయి. 1996 సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీచేసిన అకాలీదళ్, బీఎస్పీలు భారీగా లబ్ది పొందాయి. మొత్తం 13 స్థానాలకుగానూ 11 చోట్ల ఈ కూటమి విజయం సాధించింది. పోటీచేసిన మూడు చోట్లా బీఎస్పీ విజయం సాధించగా..

 

 

 

10 స్థానాల్లో పోటీచేసిన అకాలీదళ్ ఎనిమిది సీట్లను గెలిచింది.కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల సమాన దూరంలో ఉంటామని, కొత్త కూటమి ఏర్పడబోతోందని ఎస్‌ఏడీ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ గతవారం ప్రకటించారు. అంతేకాదు, ఇకపై బీజేపీతో పొత్తు ప్రసక్తేలేదని అన్నారు. పంజాబ్‌లో దళిత ఓటర్లు 31 శాతం కాగా.. దోబా పరిధిలోని 23 స్థానాల్లో వీరు కీలకం. పంజాబ్ జనాభాలో 40 శాతం మంది దళితులు. 18 నుంచి 20 స్థానాల్లో బీఎస్పీ పోటీచేసే అవకాశం ఉంది. బీజేపీకి అత్యంత పాత మిత్రపక్షమైన ఎస్ఏడీ.. 1992 నుంచి ఎన్‌డీఏలో కొనసాగుతోంది.మొత్తం 117 స్థానాలున్న పంజాబ్‌లో ఎస్ఏడీ 90 స్థానాల్లో పోటీచేస్తుండగా.. మిగతా చోట్ల మిత్రపక్షం బీజేపీ పోటీలో ఉండేది. లోక్‌సభ ఎన్నికల్లోనూ 10 చోట్ల ఎస్ఏడీ.. మూడు స్థానాలకు బీజేపీ తమ అభ్యర్థులను నిలిపేవి. గతేడాది కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ మోదీ క్యాబినెట్‌ నుంచి ఎస్ఏడీ ఎంపీ హరిసిమ్రత్ కౌర్ బాదల్ బయటకు వచ్చారు. పంజాబ్‌లో సాగు చట్టాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఎన్‌డీఏ నుంచి వైదొలిగారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Akali Dal, BSP alliance in Punjab

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *