అక్బర్ పై వేటుకు రంగం సిద్ధం

Akbar is preparing for the sector

Akbar is preparing for the sector

 Date:12/10/2018
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
ఆరుగురు మహిళా విలేఖరులను సెక్స్‌పరమైన వేధింపులకు గురిచేసిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎం.జె.అక్బర్‌ను మంత్రివర్గం నుండి తొలగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యోచిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం నైజీరియాలో పర్యటిస్తున్న అక్బర్ స్వదేశానికి రాగానే మంత్రి పదవి ఊడటం ఖాయమని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మహిళా జర్నలిస్టులు అక్బర్‌పై చేసిన ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రధాని నరేంద్ర మోదీ తెప్పించుకున్నట్లు తెలిసింది. అక్బర్‌పై వచ్చిన ‘మీటూ’ ఆరోపణలపై ఇంటలిజెన్స్ శాఖ తెరవెనక దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది.
అక్బర్ నైజీరియా నుండి తిరిగి వచ్చే సమయానికి ఇంటలిజెన్స్ నివేదిక సిద్ధమవుతుంది.. దీని ప్రకారం ప్రధాని చర్య తీసుకుంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అక్బర్ ఒక వ్యాపార ప్రతినిధుల బృందానికి నాయకుడిగా నైజీరియాలో పర్యటిస్తున్నారు. అక్బర్ ఎడిటర్‌గా ఉన్న సమయంలో తమను సెక్స్‌పరమైన వేధింపులకు గురి చేశారంటూ ఆరుగురు మహిళలు ట్విట్టర్‌లో ఆరోపించిన అనంతరం ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ చేదు అనుభవాలను వివరించటం గమనార్హం. అక్బర్ ఒక ఆంగ్ల పత్రిక, ఒక ఆంగ్ల మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా ఉన్నప్పుడు తమను సెక్స్‌పరమైన వేధింపులకు గురిచేశారు..
ఆయన తమను పలుమార్లు తన హోటల్ గదికి పిలిచి అసభ్యంగా వ్యవహరిచేవారని ఆరోపించారు. తానొక రోజు పేజీ పెట్టిస్తున్న సమయంలో వెనక నుండి వచ్చి తన బ్రా లాగారని మరో జర్నలిస్ట్ ఆరోపించారు. తన సెక్స్‌పరమైన కోరికలను తీర్చనందుకు ఆయన తనకు నరకం చూపించారని ఒక సీనియర్ మహిళా విలేఖరి ఆరోపించటం తెలిసిందే. ఉద్యోగం ఇస్తానంటూ తనను హోటల్‌కు పిలిచి దురుసుగా వ్యవహరించారని మరో జర్నలిస్ట్ ఆరోపించారు.
ఒక ఆంగ్ల పత్రికలోని అక్బర్ గదిని ‘అక్బర్ హారెం’ అనే వారని మరో విలేఖరి చెప్పారు. అక్బర్‌పై వచ్చిన సెక్స్ ఆరోపణలపై స్పందించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నిరాకరించటం కూడా వివాదాస్పదమైంది. ఇంతమంది మహిళా జర్నలిస్టులు తమ సెక్స్‌పరమైన వేధింపులను వెల్లడిస్తున్నా సుష్మా స్వరాజ్ స్పందించకపోవటం సిగ్గుచేటని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి.
Tags:Akbar is preparing for the sector

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *