Akhil Akkineni 'Mr. Majnah' jukebox released

అఖిల్‌ అక్కినేని ‘మిస్టర్‌ మజ్న’ జ్యూక్‌ బాక్స్‌ విడుదల 

Date:14/01/2019
అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మిస్టర్‌ మజ్ను’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిపబ్లిక్‌ డే సందర్భంగా ఒకరోజు ముందు జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే యూ ట్యూబ్‌లో విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. కాగా, ఈ చిత్రంలోని పాటలకు సంబంధించిన జ్యూక్‌ బాక్స్‌ను సంక్రాంతి కానుకగా సోమవారం విడుదల చేశారు. అఖిల్‌ అక్కినేని సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్‌, హైపర్‌ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్‌, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్‌ సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి.
Tags:Akhil Akkineni ‘Mr. Majnah’ jukebox released

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *