వరుస వివాదాల‌తో వార్తల్లో నిలిచిన అఖిలప్రియ

Date:26/04/2019
కర్నూలు ముచ్చట్లు:
క‌ర్నూలు జిల్లా ఆళ్ళగ‌డ్డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన భూమా అఖిల‌ప్రియా రెడ్డి వైసీపీని వీడి టీడీపీలోకి చేరిపోయారు. త‌ర‌చుగా ఆమె త‌న ప‌నితీరుతో కాకుండా వివాదాల‌తో వార్తల్లో నిలిచారు. ఏపీలో ముగిసిన ఎన్నిక‌లు అనేక పాఠాలు నేర్పుతున్నాయి. అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలుసైతం తెర‌మీదికి వ‌చ్చాయి. ముఖ్యంగా తమకు తిరుగు లేద‌ని భావించిన అనేక మంది అధికార పార్టీ నేత‌లు ఇప్పుడు విజ‌యం వరిస్తుందో లేదో న‌నే సంశ‌యంలో కొట్టుమిట్టాడుతున్నారు. వీరిలో ఇద్దరి నుంచి న‌లుగురు మంత్రులు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. క‌ర్నూలు జిల్లా ఆళ్ళగ‌డ్డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన భూమా అఖిల‌ప్రియా రెడ్డి వైసీపీని వీడి టీడీపీలోకి చేరిపోయారు. అనంత‌ర కాలంలో త‌న తండ్రి భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో అనూహ్యంగా మంత్రి ప‌ద‌విని చేప‌ట్టారు. అయితే, త‌ర‌చుగా ఆమె త‌న ప‌నితీరుతో కాకుండా వివాదాల‌తో వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా టీడీపీ నాయ‌కుడు, త‌న తండ్రికి మిత్రుడు అయిన ఏవీ సుబ్బారెడ్డితో పంచాయితీ పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా వివాదానికి కేంద్రంగా మారారు.నంద్యాల ఉప ఎన్నిక‌లో ప‌ట్టుబ‌ట్టి మ‌రీ త‌న సోద‌రుడు భూమా బ్రహ్మానంద రెడ్డికి టికెట్ ఇప్పించుకున్న అఖిల ప్రియ‌.. త‌ర్వాత కూడా ఆళ్ళగ‌డ్డ, నంద్యాల నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న ప‌ట్టు నిలుపుకొనేందుకు తీవ్రంగా శ్రమించారు.
సీనియ‌ర్లతోనే వివాదాల‌కు తెర‌దీశారు. అనేక‌సార్లు చంద్రబాబు నుంచి హెచ్చరిక‌లు కూడా జారీ చేసే ప‌రిస్థితి తెచ్చుకున్నారు. ఇక‌, ప‌ర్యాట‌క మంత్రిగా కూడా త‌న‌దైన ముద్ర వేయ‌లేక పోయారు. మంత్రి నారా లోకేష్ జోక్యం ఎక్కువ‌గా ఉంద‌ని బాహాటంగా విమ‌ర్శించి, ఇంటికే ప‌రిమిత‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. కృష్ణా, గోదావ‌రి న‌దుల్లో జ‌రిగిన రెండు ప్రమాదాల స‌మ‌యంలోనూ ప‌దుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినా మంత్రిగా ఆమె స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో చంద్రబాబు ద‌గ్గర మంచి మార్కులు కూడా ఆమె సంపాయించుకోలేక పోయారు.నియోజ‌క‌వ‌ర్గంలో ఆధిప‌త్యం చ‌లాయించ‌డం కోసం త‌ర‌చుగా ఏవీ.సుబ్బారెడ్డితో వివాదాల‌కు కార‌ణ‌మ‌వుతు.. ప్రజ‌ల‌కు కూడా విసుగుతెప్పించా రు. ఇక‌, పెళ్లి నేప‌థ్యంలో దాదాపు ఆరు మాసాలు పాల‌న‌కు కూడా దూరంగా ఉన్నారు.ఈ నేప‌థ్యంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆళ్లగ‌డ్డ నుంచి మ‌రోసా రి పోటీ చేసిన‌ప్పటికీ.. ఇక్కడ ప్రజ‌ల మ‌న‌సుల్లో భూమా నాగిరెడ్డి ప్రభావం చూపించ‌లేక‌పోయారు. తండ్రి వార‌స‌త్వం, త‌ల్లి వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకోలేక పోయారు.
దీంతో ఈ ప్రభావం ఎన్నిక‌ల్లో చూపించింద‌ని అంటున్నారు. నిజానికి గ‌త ఎన్నిక‌ల్లో ఈ కుటుంబంపై ఉన్న సానుభూతి ప‌వ‌నాలు నేడు కన్పించలేదని అంటున్నారు ప‌రిశీల‌కులు.ఇక నియోజ‌క‌వ‌ర్గంలో రెండు బ‌ల‌మైన వ‌ర్గాలుగా ఉన్న గంగుల‌, ఇరిగెల కుటుంబాలు రెండు ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపుకోసం క‌లిసి ప‌నిచేశాయి. ఈ రెండు వ‌ర్గాల‌కు ఆళ్లగ‌డ్డలో బ‌ల‌మైన వ‌ర్గం ఉంది. దీనికి తోడు ఈ నియోక‌వ‌ర్గంపై ఎంతో కొంత ప్రభావం చూపే ఏవి.సుబ్బారెడ్డితో అఖిల అంటీముట్టన‌ట్టు ఉండ‌డం, నియోజ‌క‌వ‌ర్గంలో భ‌ర్త పెత్తనం ఎక్కువ కావ‌డం కూడా ఈ సారి ఆమె గెలుపుకు అవ‌రోధాలుగా ఉన్నాయి. దీంతో మంత్రిగా అఖిల ప్రియ విజ‌యంపై అనేక అనుమానాల మేఘాలు ముసురుకున్నాయి. మ‌రి ఇది ఆమె ఓట‌మికి దారితీస్తుంద‌నే వారు కూడా ఉన్నారు. ఏదేమైనా త‌క్కువ స‌మ‌యంలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు సాధించిన అఖిల అంతే త‌క్కువ కాలంలో వివాదాల‌కు కూడా కేంద్రంగా మార‌డం ఇక్కడ చ‌ర్చనీయాంశం.
Tags:Akhilapriya who was in the news with a series of controversies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *