Natyam ad

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ ద్విభాషా చిత్రం కస్టడీ నుండి రేవతి గా గార్జియస్ కృతి శెట్టి ఫస్ట్ లుక్ విడుదల.

హైదరాబాద్ ముచ్చట్లు:


ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం కస్టడీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. నాగ చైతన్య యొక్క ఫెరోషియస్ అవతార్ తో న్యూ ఇయర్ గిఫ్ట్ గా విడుదల చేసిన గ్లిమ్ప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ రోజు మేకర్స్ ఈ చిత్రం నుండి కృతి శెట్టిని రేవతిగా పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ లో కథ ని ముందుకి నడిపించే బలమైన పాత్ర లాగా ఆలోచన రేకెత్తించే లా కృతి శెట్టి కనిపించారు  .
అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో శరత్కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.అక్కినేని హీరో నాగ చైతన్య కెరీర్ లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రూపొందుతోంది. మాస్ట్రో ఇళయరాజా మరియు అతని కుమారుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తుండగా, ఎస్ఆర్ కత్తిర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.కస్టడీ మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ అవుతుంది.తారాగణం: నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమి అమరెన్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ మరియు అనేక ఇతర ప్రముఖ నటీనటులు.

 

Tags: Akkineni Naga Chaitanya, Venkat Prabhu, Srinivasa Chitturi, Srinivasa silver screen bilingual movie Custody released first look of gorgeous Kriti Shetty as Revathi.

Post Midle
Post Midle