Natyam ad

పుంగనూరులో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడుగా ఆకుల చెన్నకేశవులు

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు న్యాయవాదుల సంఘ ఎన్నికలు గురువారం  హోరాహోరీగా  జరిగాయి . సంఘ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు పోటీ జరిగింది. ఇందులో సీనియర్‌ న్యాయవాది ఆకుల చెన్నకేశవులు 57 ఓట్లు సాధించుకుని గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు మల్లికార్జునరెడ్డి , వెంకటరెడ్డి ప్రకటించారు. అలాగే ఉపాధ్యక్షుడుగా అరవిందకుమార్‌ గెలుపొందారు. కార్యదర్శిగా రఘునారెడ్డి, స్ఫోర్డస్ సెకట్రరీగా సివి.రమేష్‌, ట్రెజరర్‌గా ప్రశాంతిలు ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. చెన్నకేశవులు మాట్లాడుతూ న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల సహకారంతో న్యాయవాదులకు హౌసింగ్‌ కాలనీ మంజూరు చేయిస్తామన్నారు. అలాగే న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.నూతన కార్యవర్గ సభ్యులను న్యాయవాదులు అభినందించారు.

 

Post Midle

Tags; Akula Chennakeshavu is the President of Advocates Association in Punganur

Post Midle